టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం..

John Kottoly: ప్రముఖ టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటుతో ఈయన మృతి చెందినట్టు తెలుస్తుంది. రెండేళ్ల కింద బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా వచ్చిన మను సినిమాలో కీలక పాత్రలో నటించాడు జాన్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 28, 2020, 7:48 PM IST
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం..
మను ఫేమ్ జాన్ కొట్టోలి కన్నుమూత (actor john kottoly)
  • Share this:
అసలే తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి చేదు వార్తలు వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు ఇండస్ట్రీ వాళ్లు కూడా. మొన్నటికి మొన్న కూడా ఓ నటుడు మరణించాడు.. దానికి ముందు ఓ నిర్మాత.. అంతకుముందు గొల్లపూడి లాంటి లెజెండ్.. ఇలా చాలా చేదు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతలోనే ఇప్పుడు మరో చేదు వార్త వచ్చేసింది. ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న ప్రముఖ టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ ఆకస్మికంగా కన్నుమూశారు. గుండెపోటుతో ఈయన మృతి చెందినట్టు తెలుస్తుంది.
మను ఫేమ్ జాన్ కొట్టోలి కన్నుమూత (actor john kottoly)
మను ఫేమ్ జాన్ కొట్టోలి కన్నుమూత (actor john kottoly)

రెండేళ్ల కింద బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా వచ్చిన మను సినిమాలో కీలక పాత్రలో నటించాడు జాన్. ఆ తర్వాత గతేడాది విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన మాస్ సినిమా ఫలక్‌నుమా దాస్‌లో కూడా నటించాడు జాన్. ఈ చిత్రాలతో పాటు మిస్టర్ అమాయకుడు, కళాకారుడు లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. ఇందులో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. కొత్తరకం సినిమాలు.. నటనతో తెలుగు ప్రేక్షకులను ఇప్పుడిప్పుడే ఆకట్టుకుంటున్న జాన్ కొట్టోలీ ఆకస్మిక మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీవ్ర దిగ్ద్రాంతికి లోనయ్యేలా చేసింది.

మను ఫేమ్ జాన్ కొట్టోలి కన్నుమూత (actor john kottoly)
మను ఫేమ్ జాన్ కొట్టోలి కన్నుమూత (actor john kottoly)

ఈయన సినిమాలు చాలా వరకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. జాన్ మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సాయి రాజేశ్‌తో పాటు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా లాంటి వాళ్లు సోషల్ మీడియాలో జాన్ మృతిపై సంతాపం వ్యక్తం చేసారు. ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు