మంచు విష్ణు మూడో కూతురు ఫస్ట్ ఫొటో బయటకొచ్చింది. తన చిన్న కూతురిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఫొటోతో పాటు పేరునూ ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. విద్య అని అచ్చమైన తెలుగు పేరుతో ఆ బేబీకి నామకరణం చేశారు. విష్ణు షేర్చేసిన ఫొటోలో విద్య చాలా క్యూట్‌గా ఉంది. పక్షుల ఈకలు, జొన్న కంకులతో చేసిన గూడులాంటి పరుపులో నిద్రపోతోంది విద్య. కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. విద్యకు మీ ఆశీస్సులు కావాలని కోరాడు మంచు విష్ణు. కాగా, మంచు విష్ణు భార్య విరానికా ఆగస్టు 9న ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.