విడాకులు తర్వాత... సింగిల్స్ డే పై మంచు మనోజ్ ఇంట్రస్టింగ్ ట్వీట్

అయితే విడాకుల తర్వాత మనోజ్... సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించాడు. ఇ

news18-telugu
Updated: November 11, 2019, 4:01 PM IST
విడాకులు తర్వాత... సింగిల్స్ డే పై మంచు మనోజ్ ఇంట్రస్టింగ్ ట్వీట్
మనోజ్ మంచు ఫైల్ ఫోటో
  • Share this:
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల తమ వివాహబంధానికి ముగింపు పలికానని ఇటీవలే ప్రకటించాడు. తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని.. వాటి వల్ల చాలా నొప్పిని కూడా అనుభవించామన్నాడు మనోజ్. అయితే విడాకుల తర్వాత మనోజ్... సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించాడు. ఇకపై తన ధ్యాస అంతా సినిమాలపైనే ఉంటుందన్నారు. ఇక ఇప్పుడు తాజాగా సింగిల్స్ డే సందర్భంగా ‘ ఐ లవ్ మి సింగిల్స్ డే ’అంటూ ఓ ట్వీట్ పెట్టాడు. నన్ను నేను ప్రేమిస్తున్నానంటూ మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు అతని ఫ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.



First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading