ఆ పేరు చెబితే తెలుగు చిత్ర సీమ అబ్బురపడుతుంది.. ఆ పేరు వింటే అభిమానులు హోరెత్తిపోతారు.. ఆ పేరు వెండి తెరపై కనిపిస్తే క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అందరూ విజిలేస్తారు.. ఆయన డైలాగ్ వింటే విమర్శకులు సైతం వహ్వా! అంటారు. కోట్లాది మంది తెలుగు సినీ ప్రేక్షకుల మదిని దోచుకున్న ఆ హీరోయే.. జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు కుటుంబం అంటే ప్రాణం. కుటుంబమే కాదు.. అభిమానులంటే ఇంకా ప్రాణం. ఎక్కడికి వెళ్లినా.. ‘క్షేమంగా ఇంటికి చేరండి’ అంటూ అందరికి జాగ్రత్తలు చెబుతారు. నార్నె వారి ఆడబిడ్డను పెళ్లాడిన ఈ నందమూరి వారసుడు.. ఇద్దరు బుడ్డోళ్లకు జన్మనిచ్చాడు. వారే అభయ్ రామ్, భార్గవ రామ్. అయితే, ఈ రోజు తన చిన్న కుమారుడు భార్గవ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరు పిల్లల ఫోటో పెట్టిన యంగ్ టైగర్.. మరో ఫోటోలో తన చిన్న కుమారుడిని చూసి పరవశించి పోతున్న ఫోటో పెట్టాడు.
ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ముద్దొస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. బుడ్డోడు అచ్చం మన బుడ్డ రామారావు లాగే ఉన్నాడు అంటూ మురిసిపోతున్నారు. అంతేకాదు.. లిటిల్ టైగర్ అని బిరుదు కూడా ఇచ్చేశారు. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలు..

జూనియర్ ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్
చిన్న కుమారుడు భార్గవ రామ్‌తో జూనియర్ ఎన్టీఆర్
Published by:Shravan Kumar Bommakanti
First published:June 14, 2019, 11:32 IST