Jr NTR: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది.. లక్ష్మీ ప్రణతి సోదరుడు..

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర (Jr NTR Nithin Chandra)

Jr NTR: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులున్నారు. తాజాగా మరో వారసుడు కూడా వచ్చేస్తున్నాడు. నందమూరి యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr NTR) బావమరిది నితిన్‌ చంద్ర త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులున్నారు. తాజాగా మరో వారసుడు కూడా వచ్చేస్తున్నాడు. నందమూరి యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది నితిన్‌ చంద్ర త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. ఈయన స్వయానా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు. ప్రముఖ వ్యాపారవేత్త, జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస రావు కుమారుడు. కొన్ని నెలలుగా నితిన్ చంద్రను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే కథలు కూడా వింటున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ కూడా బామ్మర్దికి సపోర్ట్‌గా ఉన్నాడు. నిజానికి సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో చిత్రం సీక్వెల్‌తో నితిన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూసారు. దీనిపై కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఎందుకో మరి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందులోనే ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే నితిన్ కోసం మరిన్ని కథలు కూడా వింటున్నారు కుటుంబ సభ్యులు. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్ తన బావమరిది లాంఛ్ కోసం ఓ కథ విన్నాడని.. అది బాగా నచ్చడంతో ఫైనల్ చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది.
jr ntr,jr ntr bavamaridi nithin chandra,jr ntr bavamaridi nithin chandra movies,jr ntr bavamaridi nithin chandra debut,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర,జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర సినిమాలు
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ చంద్ర (Jr NTR Nithin Chandra)

ఈ మధ్యే నటనలో శిక్షణ కూడా పూర్తి చేసుకుని వచ్చాడు నితిన్ చంద్ర. ఈ కుర్రాడి సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నితిన్ చంద్ర సినిమాను ఆయన తండ్రి నార్నే శ్రీనివాసరావు నిర్మించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా తన బామ్మర్దికి కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు ఇస్తున్నాడు. మరి చూడాలిక.. నితిన్ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడో..?
Published by:Praveen Kumar Vadla
First published: