కరోనా పై పోరాటంలో పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్స్ అందజేసిన జగపతి బాబు..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇందులో భాగంగా నటుడు జగపతి బాబు తన వంతుగా సైబరాబాద్ పోలీసులకు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్‌ను అందజేసారు.

news18-telugu
Updated: April 18, 2020, 3:27 PM IST
కరోనా పై పోరాటంలో పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్స్ అందజేసిన జగపతి బాబు..
సైబరాబాద్ పోలీసులకు మాస్కులు, శానిటైజర్స్‌ అందజేసిన జగపతి బాబు (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం కేంద్రం 21 రోజుల పాటు మొదటిసారి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కేసులు ఇంకా తగ్గకపోవడంతో మరో 19 రోజులు లాక్‌డౌన్ పొడిగించారు. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేస్తున్నారు. వీరికి సినీ నటులు కూడా అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అంతేకాదు కరోనా మహామ్మారిపై సినీ నటులు తమ వంతుగా అవగాహాన కల్పిస్తున్నారు. మరికొందరు తమకు తోచిన సహయం అందిస్తున్నారు.తాజాగా ఒకప్పటి హీరో, ఇపుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు సైబరాబాద్ పోలీసులకు N95 మాస్కులతో పాటు హ్యాండ్ శానిటైజర్స్‌ను అందజేసారు. జగపతి బాబు అందజేసిన సాయానికి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 18, 2020, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading