అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ నుస్రత్ జహాన్.. ఫ్యాన్స్‌కు సందేశం..

తృణముల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ ప్రముఖ నటి నుస్రత్ జహాన్ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ సందర్భంగా ఆమె త్వరగా  కోలుకోవాలని పలువురు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం నుస్రత్ జహాన్ ఒక వీడియోను రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: November 20, 2019, 12:01 PM IST
అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ నుస్రత్ జహాన్.. ఫ్యాన్స్‌కు సందేశం..
టాలీవుడ్ నటి ఎంపీ నుస్రత్ జహాన్ (Lok Sabha TV)
  • Share this:
టాలీవుడ్ హీరోయిన్ అదేనండి బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. అక్కడ టోలి గంజ్‌లో సినీ పరిశ్రమ స్థిర పడటంతో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. ఇక అక్కడ బెంగాలీ సినీ పరిశ్రమలో తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది. ఆ తర్వాత ఈ భామ తన తోటి నటి లోక్‌సభ సభ్యురాలు..  పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి ప్రేక్షకులతో పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకముందే.. తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయంలో పెళ్లాడి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ భామ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ సందర్భంగా ఆమె త్వరగా  కోలుకోవాలని పలువురు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం నుస్రత్ జహాన్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. నేను అనారోగ్యం నుంచి కోలుకుంటున్నాను. నా ఆరోగ్యం కోసం పరితపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అంతేకాదు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని ప్రకటించింది.


First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు