శివప్రసాద్ సినిమా జీవిత విశేషాలు.. నన్ను కొట్లే డైలాగ్‌తో ఫేమస్..

#RIPSivaPrasad: తెలుగుదేశం మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు శివప్రసాద్ కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 21, 2019, 2:35 PM IST
శివప్రసాద్ సినిమా జీవిత విశేషాలు.. నన్ను కొట్లే డైలాగ్‌తో ఫేమస్..
EX MP నటుడు శివ ప్రసాద్ కన్నుమూత (File Photo)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 21, 2019, 2:35 PM IST
తెలుగుదేశం మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు శివప్రసాద్ కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తెలుగు సినీ రంగంలో మాములు నటుడిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఎన్నో సినిమాల్లో చిన్నా చితక వేషాలతో అలరించాడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మాస్టారి కాపురం’ సినిమా శివప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అటు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఇక నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్ను కొట్లే అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యాడు శివప్రసాద్. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తెలుగులో ‘ఇల్లాలు’, రోజా హీరోయిన్‌గా పరిచయమైన ‘ప్రేమ తపస్సు’, ఆ తర్వాత ‘టోపీరాజా స్వీటి రోజా’ ‘కొక్కోరకో’ వంటి పలు సినిమాలను కూడా డైరెక్ట్ చేసాడు. ఆయనకు ఒక భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Naramalli Sivaprasad:
ఎంపీ శివప్రసాద్


చిత్తూరు జిల్లాకు చెందిన నారమల్లి శివప్రసాద్.. చంద్రబాబు చదువుకున్న కాలేజీలోనే, చదువుకున్నాడు. చంద్రబాబుతో పరిచయం ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసింది. 2009లో చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో అక్కడనుంచి తెలుగు దేశం తరుపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రెండో సారి ఎంపీగా గెలిచారు. 2019లో మాత్రం తన సమీప పత్యర్ధి వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో మూడోసారి మాత్రం ఎంపీగా ఓటమి పాలైయ్యారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలె తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...