Home /News /movies /

Pushpaka Vimanam Closing collections: ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ క్లోజింగ్ కలెక్షన్స్..

Pushpaka Vimanam Closing collections: ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ క్లోజింగ్ కలెక్షన్స్..

పుష్పక విమానం కలెక్షన్స్ (Pushpaka Vimanam collections)

పుష్పక విమానం కలెక్షన్స్ (Pushpaka Vimanam collections)

Pushpaka Vimanam Closing WW collections: మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో గతేడాది ఓటిటిలో మంచి విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda Pushpaka Vimanam Closing WW collections). విజయం ఇచ్చిన ఉత్సాహంలో వరస సినిమాలు చేస్తున్నాడు జూనియర్ దేవరకొండ.

ఇంకా చదవండి ...
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో గతేడాది ఓటిటిలో మంచి విజయం అందుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. విజయం ఇచ్చిన ఉత్సాహంలో వరస సినిమాలు చేస్తున్నాడు జూనియర్ దేవరకొండ. ఈ క్రమంలోనే ఆయన నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. టీజర్, ట్రైలర్ అంతా పెళ్లికి సంబంధించినట్లు చూపించి.. సినిమాలో మాత్రం పూర్తిగా మర్డర్ మిస్టరీ చూపించాడు దర్శకుడు దామోదర. ఇక్కడే ప్రేక్షకులకు షాక్ తగిలింది.. దాంతో సినిమాకు కూడా అదే మైనస్ అయింది. ఒకటి అనుకుని వస్తే.. మరోటి చూపించారేంటి అనేది అంటూ ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. ఇదే పుష్పక విమానం సినిమాకు నెగిటివ్ అయిపోయింది. గీత్ సైని, శాన్వీ మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్‌టైన్‌మెంట్స్, ‘టాంగా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి.

Young Heroes in Tollywood: ఇండస్ట్రీలో యువరక్తం.. టాలీవుడ్‌లోకి కుర్రాళ్ళొస్తున్నారండోయ్..!


నైజాం: 0.47 కోట్లు
సీడెడ్: 0.26 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.21 కోట్లు
ఈస్ట్: 0.10 కోట్లు
వెస్ట్: 0.07 కోట్లు
గుంటూరు: 0.11 కోట్లు
కృష్ణా: 0.09 కోట్లు
నెల్లూరు: 0.08 కోట్లు

ఏపీ + తెలంగాణ: 1.39 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.33 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్: 1.72 కోట్లు షేర్

Dil Raju - Allari Naresh - Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి నుంచి దిల్ రాజు వరకు.. సినిమా పేరే వాళ్లకు ఇంటి పేరు..


‘పుష్పక విమానం’ సినిమాను రూ.2.2 కోట్లకు అమ్మారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 2.5 రావాల్సిందే. అయితే చివరికి సినిమా కేవలం 1.72 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసి యావరేజ్‌గా నిలిచింది. ఫలితంగా బయ్యర్లకు దాదాపు 50 లక్షలు నష్టాలు వచ్చాయి. దాంతో థియేటర్స్‌లో హిట్ కొట్టాలని కలలు కన్న  ఆనంద్ దేవరకొండ కు నిరాశే ఎదురైంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Anand Devarakonda, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు