హోమ్ /వార్తలు /సినిమా /

గుండె తరుక్కుపోతోంది.. : షాద్ నగర్ హత్యాచారంపై సినీ నటుడు అలీ

గుండె తరుక్కుపోతోంది.. : షాద్ నగర్ హత్యాచారంపై సినీ నటుడు అలీ

అలి

అలి

నిందితులకు కఠిన శిక్ష పడాలని.. బాధితురాలి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందన్నారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. హత్యాచార ఘటనపై అన్ని రాష్ట్రాల ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సినీ,రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తాజాగా సినీ నటుడు అలీ దీనిపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని.. ప్రియాంక తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు.ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందన్నారు.

నిన్నటిదాకా వారి కళ్లముందు తిరగాడిన అమ్మాయి ఇలా బలైపోయిందంటే.. ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదనలో ఉన్నారోనని వాపోయారు. నిందితులను షూట్ చేయవద్దు.. ఉరితీయవద్దు.. తన కూతురికి జరిగిందే వారికీ జరగాలని ఆ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని.. నిందితుల తరుపున ఏ న్యాయవాది వాదించవద్దని బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని అన్నారు. కాగా,నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. షాద్‌నగర్ పీఎస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలు నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Ali, Priyanka reddy murder, Tollywood

ఉత్తమ కథలు