Home /News /movies /

TOLLYWOOD ACTOR AADHI PINISETTY TIES KNOT WITH ACTRESS NIKKI GALRANI VERY SOON AND HERE THE PROOF PK

Aadhi Pinisetty - Nikki Galrani: ఇంటివాడు కాబోతున్న స్టార్ హీరో.. ప్రేమించిన హీరోయిన్‌తోనే ఏడడుగులు..

ఆది పినిశెట్టి నిక్కి గల్రాని నిశ్చితార్థం (aadhi pinisetty)

ఆది పినిశెట్టి నిక్కి గల్రాని నిశ్చితార్థం (aadhi pinisetty)

Aadhi Pinisetty - Nikki Galrani: తెలుగు ఇండస్ట్రీలో మరో ప్రేమజంట ఒక్కటి కాబోతున్నారు. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. కొన్ని రోజులుగా ఈయన హీరోయిన్ నిక్కీ గల్రాని (Nikki Galrani) తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలో మరో ప్రేమజంట ఒక్కటి కాబోతున్నారు. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. కొన్ని రోజులుగా ఈయన హీరోయిన్ నిక్కీ గల్రాని (Nikki Galrani) తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ కలిసి అప్పట్లో మరకతమణి సినిమాలో కలిసి నటించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. స్నేహం నుంచి మొదలైన ఈ జోడీ.. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చారు. కొన్ని రోజులుగా ఈ ఇద్దరి ప్రేమ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ ఒక్కటి కాబోతున్నారు. 39 ఏళ్ల ఆది.. 30 ఏళ్ళ నిక్కీ గల్రానితో త్వరలోనే ఏడడుగులు నడవబోతున్నాడు. మార్చ్ 24న ఈ ఇద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో జరిగింది. ఇండస్ట్రీలోని ప్రముఖులను ఎవర్నీ పిలవలేదు.

గోప్యంగానే కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరిగింది. జీవితంలో ఒకరికొకరు తోడుగా ఉండటం అత్యున్నతమైనదని ఆది తెలిపాడు. రెండేళ్ల క్రితం తాము కలిశామని.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని చెప్పాడు ఈ హీరో. మార్చ్ 24వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని చెప్పాడు ఈ హీరో. ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిజీగా ఉన్నాడు ఆది. మొన్నీ మధ్యే క్లాప్ సినిమాతో వచ్చాడు ఈయన. ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. తెలుగులో సరైనోడు, రంగస్థలం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించాడు. ఈయన కొత్త ఇన్నింగ్స్‌కు సోషల్ మీడియాలో అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు. మరోవైపు నిక్కీ గల్రాని మొన్నటి వరకు బిజీగానే ఉన్నా.. ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Aadhi Pinisetty, Nikki Garlani, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు