హోమ్ /వార్తలు /సినిమా /

Mohan Babu: మా అమ్మకు పుట్టుచెవుడు.. ఏ కష్టం రాకుండా ఐదుగురుని అద్బుతంగా పెంచింది: మోహన్ బాబు

Mohan Babu: మా అమ్మకు పుట్టుచెవుడు.. ఏ కష్టం రాకుండా ఐదుగురుని అద్బుతంగా పెంచింది: మోహన్ బాబు

Mohan Babu

Mohan Babu

Mohan Babu: తెలుగు సినీ నటుడు, ప్రముఖ నిర్మాత, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన ఎన్నో సినిమాల్లో నటించి.

Mohan Babu: తెలుగు సినీ నటుడు, ప్రముఖ నిర్మాత, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన ఎన్నో సినిమాల్లో నటించి.. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలలో చేశాడు. ఇదిలా ఉంటే ఈయన కుటుంబం లో తన వారసత్వాన్ని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తన అమ్మ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు మోహన్ బాబు.

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాతృ దినోత్సవ సందర్భంగా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా తమ తల్లుల గురించి ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు. ఇక తాజాగా నటుడు మోహన్ బాబు కూడా మాతృ దినోత్సవ సందర్భంగా.. తల్లి లక్ష్మమ్మ ను తలుచుకున్నాడు. 1952 మార్చి 19న చిత్తూరు జిల్లాలో ఏర్పేడు మండలం మోదుగులపాలెం లో లక్ష్మమ్మ, నారాయణస్వామి దంపతులకు జన్మించారు మోహన్ బాబు. ఈయనతోపాటు నలుగురు సోదరులు కూడా ఉన్నారు. మాతృమూర్తి తన బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుందని తెలిపాడు.

కానీ తన తల్లి పుట్టి చెవుడు అని, తాము మాట్లాడే మాటలు తమ తల్లికి వినిపించకపోయినా.. తమకు మాత్రం ఎన్నో మాటలు నేర్పిందని, నడక నేర్పిందని తెలిపారు మోహన్ బాబు. ఇక వాళ్లకు ఏ కష్టం రాకుండా తమ ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేసిందని తెలిపాడు. ఇక ఆ పుణ్యాత్మురాలు కి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తల్లి కూతురు మంచు లక్ష్మి కూడా తన తల్లి గురించి సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు పంచుకున్నాడు.

First published:

Tags: Lakshmi manchu, Manchu Manoj, Manchu Vishnu, Mohan Babu, Mother, Mothers day, Tollywood, మోహన్ బాబు

ఉత్తమ కథలు