Home /News /movies /

TOLLYWOOD ACTION DIRECTOR B GOPAL BIRTHDAY SPECIAL TA

HBDBGopal:టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు దర్శకుడు బి గోపాల్..

టాలీవుడ్ డైరెక్టర్ బి.గోపాల్ (Twitter/Photo)

టాలీవుడ్ డైరెక్టర్ బి.గోపాల్ (Twitter/Photo)

తెలుగులో మాస్ హీరోయిజానికి కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడాయన. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆ దర్శకుడే  బి.గోపాల్. 

ఇంకా చదవండి ...
తెలుగులో మాస్ హీరోయిజానికి కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడాయన. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాలకు ఆయనే కేరాఫ్ అడ్రస్. అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆ దర్శకుడే  బి.గోపాల్.  నేడు ఈ దర్శకుడు బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్. మాస్ అనే పదానికి ఆయన పర్యాయపదం అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతిధ్వని’, ‘లారీ డ్రైవర్’, ‘స్టేట్ రౌడీ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘బొబ్బిలిరాజా’, ‘అసెంబ్లీ రౌడీ’,‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహా నాయుడు’,ఇంద్ర’ ఒకటా రెండా ఎన్నో టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌ను అందించిన ఘనత బి.గోపాల్ ది.టాలీవుడ్ అగ్రహీరోలందరితో సినిమాలు తెరకెక్కించి హిట్స్ అందించిన అతికొద్ది దర్శకుల్లో  బి.గోపాల్ ఒకరు. ముందుగా పి.చంద్రశేఖర్ రెడ్డిగా అసిస్టెంట్‌గా చేరిన బి.గోపాల్.. ఆ తర్వాత దర్శకేంద్రుడు   కె.రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత డి. రామానాయుడుకు చెందిన సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ప్రతిధ్వని’తో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకొని మొదటి సినిమాతోనే భారీ సక్సెస్‌ను అందుకున్నాడు.

ప్రతిధ్వని చిత్రంతో దర్శకుడిగా మారిన బి.గోపాల్ (Twitter/Photo)


ఆ తర్వాత ప్రతిధ్వని చిత్రాన్ని హిందీలో అనిల్ కపూర్, రేఖలతో ‘ఇన్షాఫ్ కీ అవాజ్’పేరుతో రీమేక్  తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘కలెక్టర్ గారి అబ్బాయి’ ‘రక్త తిలకం’ వంటి వరుస విజయాలు అందుకున్నారు.  ఒక్కో హీరోతో బి గోపాల్ ఒక్కో కెమిస్ట్రీ అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవితో బి.గోపాల్ తీసిన ‘స్టేట్‌రౌడీ’, ‘ఇంద్ర’ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.

చిరంజీవితో ‘ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు బి. గోపాల్ (Twitter/Photo)


ఇంద్ర సినిమా కూడా బి గోపాల్ పుట్టినరోజున విడుదల కావడం విశేషం.  అలాగే వెంకటేశ్‌తో ‘బొబ్బిలిరాజా’, ‘చినరాయుడు’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీలు అందించిన ఘనత కూడా బి.గోపాల్ దే.

వెంకటేష్‌తో ‘బొబ్బిలి రాజా’ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి.గోపాల్ (Twitter/Photo)


ఇంకోవైపు సీనియర్ హీరో మోహన్ బాబుతో తెరకెక్కించిన ‘అసెంబ్లీ రౌడీ’, ‘బ్రహ్మ’, ‘అడివిలో అన్న’ మూవీలు కూడా బ్లాక్ బస్టర్ సినిమాలే. అంతేకాదు హీరోగా మోహన్ బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో బి గోపాల్ తెరకెక్కించిన అసెంబ్లీ రౌడీ సినిమానే కీ రోల్ పోషించదనే చెప్పాలి. ఈ  సినిమా తర్వాత మోహన్ బాబు మళ్లీ విలన్, కామెడీ వేషాలు వేయలేదు.

మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ (Twitter/Photo)


ఇక టాలీవుడ్‌లో బాలకృష్ణ,బి.గోపాల్‌ లది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయకలో వచ్చిన ‘లారీడ్రైవర్’, రౌడీ ఇన్‌స్పెక్టర్’, సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు’ సినిమాలు తెలుగులో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసాయి. ఈ తర్వాత వచ్చిన ‘పలనాటి బ్రహ్మానాయుడు’ మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.

nandamuri balakrishna director b gopal blockbuster combination in tollywood film industry,nandamuri balakrishna,balakrishna,b gopal,b gopal balakrishna lorry driver,b gopal balakrishna rowdy inspector,b gopal balakrishna samara simha reddy,b gopal balakrishna narasimha naidu, bezawada gopal balakrishna,balayya,balayya,jai balayya,balakrishna 60th birthday,balayya 60th birthday,tollywood,బాలకృష్ణ నందమూరి,బి గోపాల్,బెజవాడ గోపాల్,బి గోపాల్ బాలకృష్ణ సూపర్ హిట్ కాంబినేషన్,బాలయ్య రౌడీ ఇన్‌స్పెక్టర్,లారీ డ్రైవర్,సమర సింహారెడ్డి,నరసింహానాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు,
బాలకృష్ణ,బి.గోపాల్ (File/Photos)


అప్పటి అగ్ర హీరో ఎన్టీఆర్ మినహా ఏఎన్నాఆర్, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్రహీరోలతో సినిమాలు తెరకెక్కించాడు బి.గోపాల్. అంతేకాదు ఇప్పటి జనరేషన్ హీరోలైన మహేశ్‌తో ‘వంశీ’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘అల్లరిరాముడు’, ప్రభాస్‌తో ‘అడవిరాముడు’, రామ్‌తో మస్కా, గోపిచంద్‌తో ‘ఆరడుగుల బుల్లెట్ వంటి సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు బి.గోపాల్ సొంతం.

గోపీ చంద్ ఆరడుగుల బుల్లెట్ (Twitter/Photo)


ఈయన చివరగా డైరెక్ట్‌గా చేసిన ‘ఆరడుగుల బుల్లెట్’ మాత్రం థియేటర్‌లో విుడదలకు నోచుకోలేదు.  మొత్తంగా 35 ఏళ్లకు పైగా సినీ కెరీర్‌లో దాదాపు ముప్పైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.

అందులో ఎక్కువ మటుకు బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు.ఈయన డైరెక్ట్ చేసిన ఎక్కువ చిత్రాలకు పరుచూరి బ్రదర్స్  మాటలు రాయడం విశేషం. మొత్తానికి టాలీవుడ్ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా బి.గోపాల్ చెరగని ముద్ర వేసాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: B.Gopal, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు