టాలీవుడ్ మూడు నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్.. టాప్‌లో మహేష్, బన్ని..

2020లో అపుడే మూడు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ మూతపడ్దాయి. లేకపోతే పరిస్థితి వేరే ఉండేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూడు నెలల్లో ఏయే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయో చూద్దాం. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 1, 2020, 8:46 AM IST
టాలీవుడ్ మూడు నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్.. టాప్‌లో మహేష్, బన్ని..
టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ (Twitter/Photos)
  • Share this:
2020లో అపుడే మూడు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్స్ మూతపడ్దాయి. లేకపోతే పరిస్థితి వేరే ఉండేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూడు నెలల్లో ఏయే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాయో చూద్దాం. 2020 యేడాది తెలుగులో రజినీకాంత్ ‘దర్బార్’తో సినీ సందడి మొదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలతో పలకరించారు. ఈ రెండు సంక్రాంతి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి 2020కు మంచి శుభారంభాన్ని ఇచ్చాయి. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 150 కోట్ల షేర్ రాబట్టి హీరోగా మహేష్ బాబు స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. మరోవైపు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా రూ. 158 కోట్ల వరకు వసూళు చేసింది. అల్లు అర్జున్ నటనకు త్రివిక్రమ్ మాయా జాలం పనిచేసిన ఈ సినిమా సంక్రాంతి సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Sankranti movies creating lot of curiosity and which movie is going to be winner in 2020 pk పండక్కి పొలోమంటూ ఒకేసారి నాలుగు సినిమాలు వస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు కానీ నిర్మాతలు మాత్రం వణికిపోతున్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. sankranti,sankranti 2020,sankranti movies 2020,allu arjun ala vaikuntapurramuloo sankranti,mahesh babu sarileru neekevvaru movie,kalyan ram entha manchivadavura movie,telugu cinema,rajinikanth darbar movie sankranti,సంక్రాంతి సినిమాలు,సంక్రాంతి సినిమాలు 2020,దిల్ రాజు సరిలేరు నీకెవ్వరు,అల్లు అరవింద్ అల వైకుంఠపురములో,తెలుగు సినిమా,రజినీకాంత్ దర్బార్
సంక్రాంతి 2020


పండగ చివర్లో కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమాతో పలకిరంచాడు.  ఈ సినిమా ఆశించిన విజయం దక్కలేదు.ఇక  రవితేజ డిస్కోరాజా సినిమాతో పలకరించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. జవవరి చివరల్లో  నాగ శౌర్య‘అశ్వథ్థామ’తో పలకరించాడు. ఈచిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది.  ఇక ఫిబ్రవరి‌లో సమంత జాను సినిమాతో పలకరించింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా.. ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఇష్టపడలేదు. మరోవైపు ప్రేమికుల రోజున  విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Tollywood 2020 first 3 Months box office report mahesh babu sarileru neekevvaru allu arjun ala vaikunthapurramloo movie got block bluster success,Mahesh babu,Allu arjun,mahesh babu sarileru neekevvaru,allu arjun ala vaikunthapurramloo,rajinikanth darbar,kalyan ram Entha Manchivaadavuraa,Samanth jaanu,raviteja disco raja,nithiin bheeshma,tollywod 3 months box office report,aposter war,mahesh babu vs allu arjun,sankranti 2020,fake collections,sankranti movies fake collections,mahesh babu fake collections,allu arjun fake collections,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Sarileru Neekevvaru collections,Mahesh Babu Sarileru Neekevvaru movie,ala vaikuntapurramuloo collections,sankranti 400 crore,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,మహేష్ బాబు ఫేక్ కలెక్షన్స్,అల్లు అర్జున్ ఫేక్ కలెక్షన్స్,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్,నితిన్ భీష్మ,అశ్వథ్థామ,రవితేజ డిస్కోరాజా,సమంత జాను,
ప్రేక్షకులను నిరాశ పరిచిన డిస్కోరాజా, సమంత జాను సినిమాలు (twitter/Photos)


ఆ తర్వాత ‘భీష్మ’గా వచ్చిన నితిన్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రం మొత్తంగా రూ. 27 కోట్ల షేర్ అందుకుంది.  అటు చివరగా నాని నిర్మాతగా విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన ‘హిట్’తో మంచి ముగింపు పలికాడు. ఈచిత్రం మొత్తంగా రూ. 6 కోట్ల షేర్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మార్చిలో ‘ ‘పలాస 1978’ సినిమాతో ఒకటి రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో పలాస సినిమాకు టాక్ బాగున్నా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు. ఆ తర్వాత కరోనా  మహామ్మారి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్ మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఇక రాబోయే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహామ్మారి తగ్గుముఖం పడితే కానీ థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితులు లేవు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 1, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading