ఇవాళ ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇవాళ అభిమానుల కోసం ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ బర్త్ డేకు రెండు రోజుల ముందు ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలకు చాలా స్పెషల్ డే. ఇవాళ ఎన్టీఆర్ బర్త్ డే... ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ అయితే.. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్‌తో పాటు ఆచార్య సినిమా కూడా ఓటీటీ వేదికగా అభిమానులకు అలరించనుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా (RRR) ZEE 5 లో మే 20 నుండి ఉచితంగా లభించనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తోంది ZEE 5. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రం పే పర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుందని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఆ విషయంలో ప్రేక్షకుల నుంచి భారీగా వ్యతిరేకత వచ్చింది. సాధారణ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, "ZEE5" T-VOD మోడ్‌ను తొలగించాలని నిర్ణయించింది. సాధారణ చందాదారులందరికీ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రాన్ని ఫ్రీ గా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
ఇక ఇవాళ ఆర్ఆర్ఆర్ తో పాటు.. ఆచార్య కూడా ఓటీటీలోకి వస్తుంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాస్టార్ చిరుతో కలిసి ఆచార్యలో నటించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాపై అభిమానులు కూడా మిశ్రమ స్పందనలు తెలియజేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో అనుకున్న సమమయం కంటే ముందుగానే వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ ఆచార్య డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇవాల్టి నుంచి (మే 20) మేకర్స్ కుదిరించుకున్న డీల్ ప్రకారం ఆచార్య సినిమా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనుంది.
దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆచార్య పాత్రలో చిరంజీవి నటించిగా, సిద్ద పాత్రలో రామ్‌చరణ్ నటించాడు. మ్యాట్నీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించారు.చరణ్ సరసన పూజాహెగ్డే నటించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.
అయితే ఆచార్య,ఆర్ఆర్ఆర్ సినిమాలు ఒకే రోజు.. ఓటీటీలోకి విడుదల కావడంతో.. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు నందమూరి అభిమానులు,.. ఇటు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో.. తెగ ఆనందపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aacharya, Jr ntr, Ram Charan, RRR