నాగార్జునకు మనం సినిమాతో పాటు ఈ రోజు ఇంకో స్పెషాలిటీ ఉంది..

మనంతో పాటు నాగార్జునకు ఈ రోజు వెరీ స్పెషల్ (Twitter/Photo)

అక్కినేని నాగార్జునకు ఈ రోజు వెరీ స్సెషల్ అనే చెప్పాలి. సరిగ్గా ఆరేళ్ల క్రితం మే 23న నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి నటించిన ‘మనం’ సినిమా విడుదలైంది. ఈ సినిమాతో పాటు నాగార్జునకు ఈ రోజు వెరీ స్పెషల్ అనే చెప్పాలి.

 • Share this:
  అక్కినేని నాగార్జునకు ఈ రోజు వెరీ స్సెషల్ అనే చెప్పాలి. సరిగ్గా ఆరేళ్ల క్రితం మే 23న నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌తో కలిసి నటించిన ‘మనం’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు చిత్ర సీమలో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున సతీమణి అమల గెస్ట్ పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడిగా నటించిన సమంత.. ఆ తర్వాత అక్కినేని ఇంటి కోడలు కావడం యాదృచ్ఛకమనే చెప్పాలి. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు ఆయన తనయుడు నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం ‘మనం’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వీయ నిర్మాణంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అందరూ హీరోలు నటించడం విశేషం. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

  మనం సినిమాతో పాటు విక్రమ్ ఒకే డేట్‌లో విడుదలయ్యాయి. (Twitter/Photo)


  సరిగ్గా 6 ఏళ్ల క్రితం అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించిన ‘మనం’ సినిమా విడుదలైతే.. 34 ఏళ్ల క్రితం 23 మే  1986లో వి.మధుసూదన రావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో తెరకెక్కిన ‘విక్రమ్’ సినిమాతోనే నాగార్జున హీరోగా పరిచయమయ్యాడు. ఈ రకంగా నాగార్జునకు మే 23వ తేదితో మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. మొదటి చిత్రంలో నటనలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరుచుకున్నారు. ఇక నిన్నటికి నిన్న మే 22న నాగార్జున హీరోగా నటించిన ‘అన్నమయ్య’ సినిమా విడుదలై 23 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ రకంగా మే నెల నాగార్జునకు వెరీ స్పెషల్ అనే చెప్పాలి. నాగార్జున 34 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 100 చిత్రాలకు చేరువలో ఉన్నారు. అంతేకాదు తండ్రి నట వారసుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టి.. కొడుకులు ఇద్దరు హీరోలైనా.. ఇప్పటికీ కొడుకులకు గట్టి పోటీ ఇస్తున్న హీరో ఈ తరంలో నాగార్జున తప్పించి మరొకరు లేరనే చెప్పాలి. మొత్తంగా ఈ రోజు నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: