ఈ రోజు మెగాస్టార్ చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవికి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. ఎందుకు స్పెషల్ అని చిరంజీవి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

news18-telugu
Updated: April 8, 2020, 11:22 AM IST
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవికి వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..
చిరు చిన్నప్పటి ఫోటో (Twitter/Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవికి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. అందరు ఈ రోజు చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ కొడుకు హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ అని అనుకున్నారు. మరోవైపు  ఇదే రోజు చిరు చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు. అందుకే చిరంజీవి ఇది స్పెషల్ అనే డౌట్స్ కూడా వచ్చాయి. కానీ ఇవేమి కావు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా తనకు వెరీ స్పెషల్ అని చిరంజీవి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శివ శంకర వర ప్రసాద్ అనే వ్యక్తి హనుమంతునిపై భక్తితోనే చిరంజీవిగా మారి.. మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఈ విషయాన్ని చిరు ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు చిరు చిన్న తమ్ముడు కళ్యాణ్ బాబు కూడా తన పేరును హనుమంతుని పేరు కలిసొచ్చేలా పవన్ కళ్యాణ్‌గా మార్చుకొని పవన్ స్టార్‌గా ఎదిగారు.

today hanuman jayanthi very special day for mega star chiranjeevi,chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi hanuman jayanthi,chiranjeevi old photo,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi help to his one of his fan naga laxmi,chiranjeevi help to his lady fan,tollywood,telugu cinema,chiranjeevi movies,చిరంజీవి,చిరంజీవి ట్విట్టర్,చిరంజీవి అభిమానికి సాయం,అభిమానికి చిరంజీవి సాయం,అభిమానికి గుండె ఆపరేషన్ చేయిస్తోన్న చిరంజీవి,హనుమాన్ జయంతి శుభాకాంక్షలు,చిరంజీవి బాపు అనుబంధం,చిరంజీవి ఆంజనేయ స్వామితో అనుబంధం
చిరు చిన్నప్పటి ఫోటో (Twitter/Photo)

మరోవైపు చిరంజీవి ఆంజనేయ స్వామితో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసారు. ఇక చిరంజీవి తల్లిగారైన అంజనా దేవి పేరు కూడా ఆంజనేయ స్వామి పేరు తల్లి పేరు కావడం యాదృచ్చికమనే చెప్పాలి. చిరుకు ఆయన చిన్నపుడు 1962లో ఓ లాటరీలో ఓ బొమ్మ వచ్చింది. అప్పటి నుంచి ఆ బొమ్మ తన దగ్గర భద్రంగా ఉందని చెప్పారు. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు ఆ కనుబొమ్మలు, కళ్లు, ముక్కు అచ్చం నీలాగే ఉన్నాయి అన్నారు. అంటూ అప్పటి తన ఫోటోను చిరు.. అభిమానులతో షేర్ చేసుకున్నారు.

today hanuman jayanthi very special day for mega star chiranjeevi,chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi hanuman jayanthi,chiranjeevi old photo,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi help to his one of his fan naga laxmi,chiranjeevi help to his lady fan,tollywood,telugu cinema,chiranjeevi movies,చిరంజీవి,చిరంజీవి ట్విట్టర్,చిరంజీవి అభిమానికి సాయం,అభిమానికి చిరంజీవి సాయం,అభిమానికి గుండె ఆపరేషన్ చేయిస్తోన్న చిరంజీవి,హనుమాన్ జయంతి శుభాకాంక్షలు,చిరంజీవి బాపు అనుబంధం,చిరంజీవి ఆంజనేయ స్వామితో అనుబంధం
తన చిన్నప్పటి ఫోటోను షేర్ చేసిన చిరంజీవి (Twitter/Photo)

ఆ తర్వాత 2002లో బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి ఫోటోను గీసి పంపుతానని అన్నారు. నేను అది పాలరాతి మీద చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటపుడు ఆయన ఏమన్నారో తెలుసా.. ఈ బొమ్మను గీస్తుంటే మీ పోలికలే వచ్చాయన్నారు. నేను అలాగే గీసానన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి నాకు ఉండటం విచిత్రమే. అంటూ హనుమాన్ జయంతితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇక చిరంజీవి తన ఇష్ట దైవమైన హనుమంతుని వేషాన్ని జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో వేసారు. ఈ సినిమాలో హనుమంతునిపై జై చిరంజీవా అనే పాట ఇప్పటికీ పాపులరే. అంతకు ముందు చిరంజీవి...ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వలో చేసిన ‘కొండవీటి దొంగ’ సినిమాలో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పాటను విజయశాంతితో కలిసి చేసారు. ఈ పాట డ్యూయట్ అయినా.. అందులో ఆంజనేయ స్వామికి చేసే కైంకర్యాలను వివరిస్తూ ఈ డ్యూయట్‌ను వేటూరి గారు రాయడం విశేషం.Published by: Kiran Kumar Thanjavur
First published: April 8, 2020, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading