Home /News /movies /

TODAY ALLARI NARESH BIRTHDAY SPECIAL STORY ON COMEDY HERO SB

Allari Naresh Birthday: నటనతో మెప్పించి.. పడిలేచిన.. అల్లరి నరేష్‌కు బర్త్‌డే విషెస్ పుట్టినరోజు..

అల్లరి నరేష్

అల్లరి నరేష్

ఇటీవల కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఆ సమయంలో మళ్ళీ తనలోని నటుడ్ని బయటకి తీసి కంటెంట్ ఆధారంగా నాంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

  అల్లరి నరేష్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయనకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అల్లరి నరేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన పేరు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ రెండో కుమారుడు. 2002లో వచ్చిన అల్లరి అనే చిత్రంతో వెండితెరపై మెరిసి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాలో తన నటనతో మెప్పింది తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితం అయ్యాడు. ఇక నరేష్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ గతంలోనే నేను, గమ్యం..లాంటి మంచి కంటెంట్ సినిమాలు కూడా తీయగలను, ఎలాంటి పాత్ర అయినా పోషించగలను అని నిరూపించాడు. ఇక నరేష్ కామెడీ చేస్తే మామూలుగా ఉండదు.ఈ తరం రాజేంద్ర ప్రసాద్‌గా తన సినిమాల్లో నవ్వులు పూయించాడు.

  నరేష్ హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో అతను సీమటపాకాయ్. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో ఫిట్టింగ్ మాస్టార్. తన నవ్వులతో ఆడియన్స్‌కు మడతకాజా తినిపించడంలో సీమశాస్త్రీ. గోపీ అంటూ గోడమీదపిల్లిలా నవ్వులు కురిపించిన..బెట్టింగ్ బంగార్రాజుగా వీక్షకులను సరదాగా కాసేపు నవ్వించిన అతనికే చెల్లింది. గత కొన్నేళ్లుగా తెలుగు కామేడీ సినిమాలకు అతనే కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తాజాగా హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో 20 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే నరేష్ నటించిన ఇటీవల కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఆ సమయంలో మళ్ళీ తనలోని నటుడ్ని బయటకి తీసి కంటెంట్ ఆధారంగా నాంది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయంతో కంబ్యాక్ ఇచ్చాడు.

  గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర నరేష్ నటనకు పట్టం కట్టాయి. విమర్శకులతో కూడా ప్రశంసలు అందుకునేలా చేశాయి. నరేష్ వివాహం 2015లో మే 29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్ లో జరిగింది. ఇతడు చెన్నైకి చెందిన విరూపతో జరిగింది. ఇక నరేష్ ప్రస్తుతం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా చేస్తున్నాడు. ఇది ఆదివాసీల ఇతివృత్తంతో సాగే చిత్రం. కొన్ని నెలల క్రితం చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

  ఈ చిత్రంలో అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నాడు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నరేశ్ భావిస్తున్నాడు. తాజాగా కాసేపటి క్రితమే నరేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ట్రైలర్‌‌కు యూ ట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది విడుదల అయిన కాసేపటికే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇక ట్రైలర్ చూసిన నెటిజన్స్ నరేష్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నారు.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Allari naresh, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు