బెంగాలీ ఎంపీలు చేసిన ఈ డాన్స్ చూస్తే చూపుతిప్పుకోలేరు..

ఈ నెల 29 నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి మమత బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా గెలుపొందిన సినీ నటులు నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తులు దుర్గా మాత ఉత్సవాల సంబంధించి ఒక పాటలో నటించారు.

news18-telugu
Updated: September 20, 2019, 6:01 PM IST
బెంగాలీ ఎంపీలు చేసిన ఈ డాన్స్ చూస్తే చూపుతిప్పుకోలేరు..
నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి నృత్య రూపకం (Youtube/Photo)
  • Share this:
ఈ నెల 29 నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను దేశ వ్యాప్తంగా అందరు ఎంతో భక్తి విశ్వాసాలతో జరుపుకుంటారు. బెంగాల్‌లో మాత్రం దుర్గా మాత ఉత్సవాలకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి మమత బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా గెలుపొందిన సినీ నటులు నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తులు దుర్గా మాత ఉత్సవాల సంబంధించి ఒక పాటలో నటించారు. బెంగాలీలో తెరకెక్కిన ‘ఆశే మా దుర్గాశే’ పాటకు ఈ ఇద్దరు ఎంపీలు శాస్త్రీయ నృత్యం చేసారు. ఈ పాటలో ప్రముఖ బెంగాలీ నటి సుభశ్రీ గంగూలి కూడా యాక్ట్ చేసింది.

దుర్గామాత పూజా సాంగ్ 2019 పేరుతో కెప్టెన్ టీఎంటీ ఈ సాంగ్‌ను ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేసారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు