Home /News /movies /

అతి చేస్తోన్న టిక్‌టాక్ స్టార్‌పై కేసు నమోదు... ఆత్మ హత్యాయత్నం..

అతి చేస్తోన్న టిక్‌టాక్ స్టార్‌పై కేసు నమోదు... ఆత్మ హత్యాయత్నం..

టిక్ టాక్ స్టార్ సుబ్బలక్ష్మి Photo : Tiktok

టిక్ టాక్ స్టార్ సుబ్బలక్ష్మి Photo : Tiktok

టిక్‌టాక్‌లో రౌడీబేబీ సూర్యగా పాపులరైనా తమిళ టిక్ టాక్ స్టార్ సుబ్బలక్ష్మి సూసైడ్ అటెంప్ట్ చేసింది.

    టిక్‌టాక్‌లో రౌడీబేబీ సూర్యగా పాపులరైనా తమిళ టిక్ టాక్ స్టార్ సుబ్బలక్ష్మి సూసైడ్ అటెంప్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. తిరువూరుకు చెందిన ఈమె పలు రకాల టిక్‌ టాక్‌ వీడియోలతో పాపులర్‌ అయింది. కాగా సుబ్బలక్ష్మి ఆ మధ్య సింగపూర్ వెళ్లి లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలపాటు అక్కడే చిక్కుకుపోయింది. అయితే లాక్ డౌన్ సడలించడంతో ఇటీవల ఇండియా తిరిగొచ్చింది సుబ్బలక్ష్మి. ఈ నేపథ్యంలో సుబ్బలక్ష్మికి విమానాశ్రయంలో కరోనా పరీక్షల నిర్వహిస్తుండగా తప్పించుకుని తిరువూరులోని ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమెను క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు, అక్కడి పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. సుబ్బలక్ష్మి తనని తాను ఓ స్టార్ హీరోయిన్‌‌గా భావించేది. తాను సింగపూర్‌లో ఏసీ గదుల్లో ఉండేదాన్ని అని.. కరోనా టెస్టుల నేపథ్యంలో తనకు ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయాలని అక్కడి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు సర్కారు దావాఖానాలో సాధారణ ప్రజల మధ్య తాను ఉండలేనంటూ నానా హంగామా చేయడంతో పాటు ఓ విలేకరిని అసభ్య పదజాలంతో తిట్టడంతో అతను పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుబ్బలక్ష్మి సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అయితే అది గమనించిన చుట్టుపక్కల వారు సుబ్బలక్ష్మిను దగ్గరలో ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోన్న సుబ్బలక్ష్మి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
    First published:

    Tags: Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు