హోమ్ /వార్తలు /సినిమా /

వినవే బర్రె పిల్ల పాట బ్యాగ్రౌండ్ తెలుసా.. లిరిక్స్ మీకోసం..

వినవే బర్రె పిల్ల పాట బ్యాగ్రౌండ్ తెలుసా.. లిరిక్స్ మీకోసం..

వీర కంకణం సినిమా వినవే బర్రె పిల్ల సాంగ్ (vinave barre pilla song)

వీర కంకణం సినిమా వినవే బర్రె పిల్ల సాంగ్ (vinave barre pilla song)

Vinave Barre Pilla song TikTok: లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలో తెలియక అంతా టిక్ టాక్‌పై దండయాత్ర చేస్తున్నారు. ఇక ఇందులో ఒక్కోసారి ఒక్కో పాట బాగా ఫేమస్ అవుతుంది.

టిక్ టాక్ ఓపెన్ చేస్తే చాలు.. ఇప్పుడు అందరి ఫోన్స్‌లో ఒకటే పాట వినిపిస్తుంది. అదే వినవే బర్రె పిల్ల. ఇప్పుడు టిక్ టాక్ వీడియోస్ ఇఫ్పుడు ఎలాంటి సందడి చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఏం చేయాలో తెలియక అంతా టిక్ టాక్‌పై దండయాత్ర చేస్తున్నారు. ఇక ఇందులో ఒక్కోసారి ఒక్కో పాట బాగా ఫేమస్ అవుతుంది. మొన్నటి వరకు రాజమండ్రి రంభ అంటూ అంతా అదే పాటకు చిందేసారు. ఇప్పుడు వారం రోజులుగా వినవే బర్రె పిల్ల.. నువ్వినవే బర్రె పిల్లా విన్నావా బర్రెపిల్ల, విన్నావే బర్రెపిల్ల.. నేనే నా ఎర్రి గొల్ల అంటూ ఓ పాట వైరల్ అవుతుంది. దాంతో ఈ పాట కోసం చాలా మంది తెగ వెతికేస్తున్నారు.

' isDesktop="true" id="501384" youtubeid="Omg5ihAMTtI" category="movies">

అసలెక్కడి నుంచి వచ్చింది ఈ పాట.. పుట్టు పూర్వోత్తరాలేంటి అంటూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న ఈ పాట అందర్నీ అలరిస్తుంది. 1957లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన వీర కంకణం సినిమాలోనిది ఈ పాట. దక్షిణామూర్తి సంగీతం అందించిన ఈ పాటలోని లిరిక్స్ ఇప్పటి తరానికి బాగానే తగులుతున్నాయి. ముఖ్యంగా ఇందులోని కొన్ని పదాలు అద్భుతంగా ఉన్నాయి.

వీర కంకణం సినిమా పోస్టర్స్ (vinave barre pilla song)
వీర కంకణం సినిమా పోస్టర్స్ (vinave barre pilla song)

నిజానికి మంచోడే.. నేల కూలి పోతాడే..

అన్నవోడే నా ఎర్రి గొల్ల.. ఇది విన్నావా బర్రె పిల్ల

వినవే బర్రె పిల్ల, నువ్వినవే బర్రె పిల్లా విన్నావా బర్రెపిల్ల,

విన్నావే బర్రెపిల్ల.. నేనే నా ఎర్రి గొల్ల.

గొప్పోళ్ళ ఆటలన్నీ.. గుట్టు మట్టుబయట పెట్టి..

గొప్పోళ్ళ ఆటలన్నీ చెప్పుకుంటే సిగ్గు సిగ్గు.

వినవే బర్రె పిల్ల, నువ్వినవే బర్రె పిల్లా విన్నావా బర్రెపిల్ల,

విన్నావే బర్రెపిల్ల.. నేనే నా ఎర్రి గొల్ల.

పచ్చి మోసగాడే పట్టె మంచం పానుపుకెక్కి పవళించుతాడటే..

ఆడి మాట వినని వాడే మాడి మరణించుతాడే.

వినవే బర్రె పిల్ల, నువ్వినవే బర్రె పిల్లా విన్నావా బర్రెపిల్ల,

విన్నావే బర్రెపిల్ల.. నేనే నా ఎర్రి గొల్ల.

నాయకుడి వేషమేసి.. నమ్మించి మోసగించి కోట్లకు పడిగెత్తుతారు కదే.

ఊరు మంచి కోరి రోజల్లా.. పాటు పడే బీదోళ్లు బూడిదవుతారే.

ఎవరెవరో బాగుకుంటారే.. అంటూ సాగుతుంది ఈ పాట.

First published:

Tags: NTR, Telugu Cinema, Tik tok, Tollywood

ఉత్తమ కథలు