టిక్‌టాక్ ఫేమ్ ఉప్పల్ బాలు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి స్పందించాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఆరోజు ఏం జరిగిందో వివరించాడు.హైదరాబాద్ జెమినీ నగర్లో నిర్వహించిన బోనాల వేడుకకు రవిచందర్ అనే వ్యక్తి తనను గెస్ట్‌గా పిలిస్తే వెళ్లానని చెప్పాడు. పలారం బండి ఊరేగింపు సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై తనకు సన్మానం చేసేందుకు పిలిచారని అన్నాడు. స్టేజీపై తనకు శాలువా కప్పిన సందర్భంలో వెనకి నుంచి ఎవరో తలపై కొట్టారని.. పొరపాటున అలా జరిగిందేమోనని మొదట లైట్ తీసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత మరోసారి అలాగే చేసేసరికి.. అక్కడే ఉన్న రవిచందర్ అతన్ని వారించాడని చెప్పాడు. తనపై దాడి చేసిన వ్యక్తితో అప్పుడే తేల్చుకుని ఉండేవాళ్లమని.. కానీ గొడవ పెట్టుకోవడం ఇష్టం లేకనే అక్కడినుంచి సైలెంట్‌గా వెళ్లిపోయామని చెప్పుకొచ్చాడు.
మరుసటి రోజు తనపై దాడి వీడియో వైరల్ కావడంతో చాలా ఫోన్లు వచ్చాయని.. తన అభిమానులు కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పాడు.
దాంతో తనపై దాడి చేసిన వ్యక్తి తన దగ్గరికొచ్చి బతిమాలుకున్నాడని.. కేసు విత్ డ్రా చేసుకోవాలని కాళ్లు మొక్కాడని అన్నాడు. అతని కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో..అర్థం చేసుకుని కేసు వాపస్ తీసుకున్నానని చెప్పాడు. తనవల్ల ఇంకొకరి జీవితం ఇబ్బందులపాలు కావద్దనే కేసు విత్ డ్రా చేసుకున్నట్టు తెలిపాడు.
Andarini Navvisthunna #UppalBal ni kottadam yenduku ra ???
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.