Who Is దుర్గారావు ఇప్పుడు యూట్యూబ్ లో అదే ట్రెండింగ్ టాపిక్.. నెటిజన్లు అంతా ఎవరీ దుర్గారావు అంటు వెతకడం స్టార్ట్ చేశారు. నిజానికి ఈ దుర్గారావు ఓ టిక్ టాక్ స్టార్. ఈయనది అమలాపురం. తన భార్యతో కలిసి ఎన్నో డైలాగ్స్, మరెన్నో డ్యూయెట్స్ చేసి దాదాపు టిక్ టాక్ లో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఈయనకో డిఫరెంట్ స్టైల్ ఉంది. ఇటీవలే జబర్థస్త్ లో కూడా కనిపించాడు ఈ దుర్గారావు.! అతడి డ్యుయెట్ నే తీసుకొని…దానికి కాస్త ఇంప్రవైజ్ చేసి పండు ఢీ షోలో అదరగొట్టారు. పలాస చిత్రంలో నాది నెక్లెస్ గొలుసు అనే పాటకు దుర్గారావు చేసిన డాన్సును ఢీ షోలో పేరడీ చేసి నవ్వించడమే కాకుండా అతడి స్టెప్పులతో అదరగొట్టాడు డాన్సర్ పండు. ఈ పాట తర్వాత…దుర్గారావు దంపతులు తెగ ఫేమస్ అయిపోయారు. అయితే దుర్గారావు దంపతులను తాజాగా ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు రఘు కుంచె స్వయంగా కలిసి సన్మానించారు. అంతేకాదు ఇద్దరికీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. పలాస చిత్రంలో నక్కిలీసు గొలుసు పాటను పాడటంతో పాటు మ్యూజిక్ డైరక్టర్ గా కూడా వ్యవహరించిన రఘు కుంచె ప్రత్యేకంగా దుర్గారావు దంపతులను సన్మానించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tik Tok Star Durga Rao