Home /News /movies /

TIK TOK SUPER STAR SIYA KAKKAR COMMITS SUICIDE IN DELHI AT THE AGE OF JUST 16 PK

టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య.. 16 ఏళ్ల వయసులోనే..

టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య (siya kakkar suicide)

టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య (siya kakkar suicide)

Siya Kakkar suicide: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నుంచి ఇంకా కోలుకోకముందే మరో ఫ్యూచర్ స్టార్ కన్నుమూసింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే సియా కక్కర్ ఆత్మహత్య చేసుకుంది.

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నుంచి ఇంకా కోలుకోకముందే మరో ఫ్యూచర్ స్టార్ కన్నుమూసింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే సియా కక్కర్ ఆత్మహత్య చేసుకుంది. టిక్‌టాక్‌లో ఈమెకు చాలా ఫాలోయింగ్ ఉంది. దేశవ్యాప్తంగా ఈమెకు మంచి ఇమేజ్ ఉంది. టిక్‌టాక్ అంతా ఈమె జపం చేస్తుంటారు కుర్రాళ్లు. అలాంటిది ఇంత చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్ భయానీ తన సోషల్ మీడియాలో ఈమె సూసైడ్ గురించి తెలిసింది. సియా కక్కర్ చివరిగా తన మేనేజర్ అర్జున్ సరిన్‌తో మాట్లాడింది.
టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య (siya kakkar suicide)
టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య (siya kakkar suicide)

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. సియా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. అసలెందుకు ఈమె సూసైడ్ చేసుకుందనేది మిస్టరీగా మారింది. తనతో మాట్లాడిన సమయంలో ఈమె ఎలాంటి బాధలో లేదని.. అలాంటి ఉద్దేశ్యం ఉన్నట్లు కూడా అనిపించలేదని మేనేజర్ తెలిపాడు.
View this post on Instagram

And Its TIME to get knocked out by this lethal combination of an Epic Punjabi Song and an enchanting beauty. Watch the King of Desi Hip-Hop Bohemia, soulful singer JS Atwal along with Lola Gomez in the official video of Our Latest Single, "Sharaabi Teri Tor". The Most Awaited Song of 2020 is OUT !! Watch the Video Now. . . . @iambohemia @atwalinsta @lolitaxo__ @mbmusicco @meetbrosofficial @meet_bros_manmeet @harmeet_meetbros @shaxeoriah @urshappyraikoti @jaggisim @desihiphopking @touchblevins @raajeev.r.sharma @itsumitsharma @psycho_marketer @fameexpertz #SharaabiWalk #SharaabiWalkChallenge #SharaabiTeriTor #Bohemia #HipHop #Rap #Punjabi #JsAtwal #HappyRaikoti #intoxicating #MBMusic #sharaab #musicvideo #fameexpertz

A post shared by Siya Kakkar (@siya_kakkar) on


టిక్‌టాక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు కూడా పాపులర్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో 91 వేలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న సియా కక్కర్‌.. టిక్‌టాక్‌లో సుమారు 11 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు టిక్‌టాక్‌లో సుమారు 20 గంటల వీడియోలను పోస్ట్ చేసింది. తన చివరి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో సియా కక్కర్ పంజాబీ పాటకు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈమె ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం రేపుతుంది.
First published:

Tags: Bollywood, Hindi Cinema, Tik tok

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు