టిక్ టాక్ బ్యాన్ అయి ఆర్నెళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ వాళ్లకు క్రేజ్ మాత్రం అలాగే ఉంది. అప్పట్లో వరస వీడియోలు చేసి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కొందరు ఇప్పటికీ అదే క్రేజ్ కంటిన్యూ చేస్తున్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్లు అదే ఫేమ్ సోషల్ మీడియాలో కంటిన్యూ అయ్యేలా చూస్తున్నారు. టిక్ టాక్ కాకుండా ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్లలో తమ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి పేరు షేక్ రఫీ. ఈయన టిక్ టాక్‌లో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నెల్లూరులో ఉండి అక్కడే వీడియోలు అప్ లోడ్ చేస్తుండేవాడు. ఇప్పుడు ఈయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేధింపుల కారణంగానే ఈయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. రంగనాయకులపేట వాసులు రియాజ్, షాహీనా దంపతులు. వాళ్ళ మూడో కుమారుడు షేక్ రఫి. ఇతను స్థానికంగా ప్రైవేట్ కార్యక్రమాలను వీడియోలు తీస్తుంటాడు. వాటితో పాటు అప్పట్లో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. దాంతో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాడు. ఈయనకు నారాయణరెడ్డి పేట వాసి ముస్తఫాతో స్నేహం ఏర్పడింది. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మెలుగులున్నారు. అయితే అక్కడే ముస్తాఫా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె రఫీకి కూడా తెలుసు. అయితే ముస్తఫాతో కాకుండా రఫీతో ఆ అమ్మాయి క్లోజ్‌గా ఉండటంతో తరుచూ రఫీ, ముస్తాఫా మధ్య గొడవలు జరిగేవి. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని రఫీని, ఆ యువతిని నాలుగొవ మైలు రాయి వద్దకు రావాలని చెప్పాడు.

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ (Tik Tok Star Shaik Rafi)
అక్కడికి అప్పటికే ముస్తాఫా తనతో పాటు స్నేహితులను కూడా తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చిన రఫీపై దారుణంగా దాడి చేసాడు. తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చిన రఫీని రియాజ్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఏం జరిగిందని రఫీ నుంచి మొత్తం సమాచారం తీసుకుని జనవరి 21న నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ (Tik Tok Star Shaik Rafi)
ఆ తర్వాత కూడా ఈ విషయంలో ముస్తాఫా నుంచి బెదిరింపులు, వేధింపులు రావడంతో జనవరి 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడింది కేవలం వేధింపుల కారణంగానే అని.. ముస్తాఫాపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేసాడు. పోలీసులు కూడా ధర్యాప్తు మొదలు పెట్టారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 24, 2021, 19:37 IST