Home /News /movies /

Tik Tok Star Durga Rao: టిక్ టాక్ స్టార్ దుర్గారావు డ్యాన్స్‌కు శేఖర్ మాస్టర్ ఫిదా..

Tik Tok Star Durga Rao: టిక్ టాక్ స్టార్ దుర్గారావు డ్యాన్స్‌కు శేఖర్ మాస్టర్ ఫిదా..

దుర్గారావు చేసిన పనికి శేఖర్ మాస్టర్ ఫిదా (Youtube/Photo)

దుర్గారావు చేసిన పనికి శేఖర్ మాస్టర్ ఫిదా (Youtube/Photo)

Tik Tok Star Durga Rao | ఈ మధ్యకాలంలో టిక్‌టాక్‌లో ఎక్కువగా పాపులర్ అయ్యాడు దుర్గా రావు.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ పై బ్యాన్ విధించింది.  దీంతో దుర్గారావు టిక్‌టాక్  ప్రత్యామ్నాలపై దృష్టి పెట్టాడు. తాజాగా దుర్గారావు అభిమానుల కోసం చేసిన పనిని శేఖర్ మాస్టర్ మెచ్చుకున్నారు.

ఇంకా చదవండి ...
    ఈ మధ్యకాలంలో టిక్‌టాక్‌లో ఎక్కువగా పాపులర్ అయ్యాడు దుర్గా రావు.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ పై బ్యాన్ విధించింది.  దీంతో దుర్గారావు టిక్‌టాక్  ప్రత్యామ్నాలపై దృష్టి పెట్టాడు. ఇక ఈయన  టిక్ టాక్‌లో తనకు మాత్రమే సాధ్యమయ్యే డ్యాన్స్ మూమెంట్స్‌తో యమ పాపులర్ అయ్యాడు.  రీసెంట్‌గా దుర్గారావు జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది స్కిట్‌లో దర్శన మిచ్చిన దుర్గారావు.. అక్కడ కూడా అదరగొట్టాడు. ఉన్నది కొద్ది సేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. ఆ తర్వాత ‘అదిరింది’లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. టిక్ టాక్ యాప్ ఉన్నప్పుడు తన భార్యతో కలిసి తెలుగు సినిమా పాటలకు స్టెప్స్ వేస్తూ.. దానికి తగ్గట్లుగా మేకప్, క్యాస్టూమ్స్ మార్చుతూ అదరగొట్టేవాడు. ఎంతలా అంటే మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు.

    తాజాగా ఈయన యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసాడు. దుర్గారావు నాట్యమండలి పేరుతో ఈ యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేసాడు. ఈ సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.. కొత్తగా యూట్యూబ్ ఛానెల్  ఓపెన్ చేసిన దుర్గారావును అభినందించడంతో పాటు ఆ చానెల్‌ సబ్‌స్క్రైబ్ చేసుకోమని ప్రేక్షకులను కోరాడు. మొత్తంగా దుర్గారావు చాల ా తక్కువ టైమ్‌లోనే తన డాన్స్ మూమెంట్స్‌తో పాపులర్ అయ్యాడు. ఇప్పటి వరకు టిక్‌టాక్‌తో ప్రేక్షకులతో ఇంటారాక్ట్ అయిన దుర్గారావు ఇప్పటి నుంచి యూట్యూబ్ ఛానెల్ వేదికగా ప్రేక్షకులను అలరించనున్నాడన్న మాట.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth comedy show, Sekhar Master, Tik tok, Tik Tok Star Durga Rao, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు