హోమ్ /వార్తలు /సినిమా /

Tik Tok Star Durga Rao: టిక్ టాక్ స్టార్ దుర్గారావు దూకుడు మాములుగా లేదుగా.. అక్కడ దుమ్ము రేపుతున్న టిక్‌టాక్ స్టార్..

Tik Tok Star Durga Rao: టిక్ టాక్ స్టార్ దుర్గారావు దూకుడు మాములుగా లేదుగా.. అక్కడ దుమ్ము రేపుతున్న టిక్‌టాక్ స్టార్..

యూట్యూబ్ స్టార్ దుర్గారావు మరో రికార్డు (Youtube/Photo)

యూట్యూబ్ స్టార్ దుర్గారావు మరో రికార్డు (Youtube/Photo)

Tik Tok Star Durga Rao | టిక్ టాక్ స్టార్ దుర్గారావు గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యాడు. తాజాగా ఈయన యూట్యూబ్ వేదికగా మరో రికార్డును అందుకున్నారు.

Tik Tok Star Durga Rao | టిక్ టాక్ స్టార్ దుర్గారావు గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఇతను టిక్‌ టాక్‌తో ఎక్కువగా పాపులర్ అయ్యాడు.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ పై బ్యాన్ విధించింది.  దీంతో దుర్గారావు టిక్‌టాక్  ప్రత్యామ్నాలపై దృష్టి పెట్టాడు. ఇక ఈయన  టిక్ టాక్‌లో తనకు మాత్రమే సాధ్యమయ్యే డ్యాన్స్ మూమెంట్స్‌తో యమ పాపులర్ అయ్యాడు.  రీసెంట్‌గా దుర్గారావు జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది స్కిట్‌లో దర్శన మిచ్చిన దుర్గారావు.. అక్కడ కూడా అదరగొట్టాడు. ఉన్నది కొద్ది సేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. ఆ తర్వాత ‘అదిరింది’లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే కదా. టిక్ టాక్ యాప్ ఉన్నప్పుడు తన భార్యతో కలిసి తెలుగు సినిమా పాటలకు స్టెప్స్ వేస్తూ.. దానికి తగ్గట్లుగా మేకప్, క్యాస్టూమ్స్ మార్చుతూ అదరగొట్టేవాడు. ఎంతలా అంటే మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. ఇపుడు టిక్‌టాక్ లేకపోవడంతో ఇతను సరికొత్తగా దుర్గారావు నాట్యమండలి పేరుతో ఈ యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేసాడు. అందులో తన భార్యతో కలిసి వివిధ డాన్సులకు తమదైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈయన యూట్యూబ్ ఛానెల్‌కు శేఖర్ మాస్టర్ సహా పలువురు దుర్గారావును సమర్ధించారు.

' isDesktop="true" id="631274" youtubeid="vJ3n5VAb93c" category="movies">

తాజాగా వీరి యూట్యూబ్ ఛానెల్‌కు లక్ష మంది సబ్‌స్క్రైబర్లు నమోదు అయ్యారు. అది కూడా కేవలం పదిహేను రోజుల్లో దుర్గారావుకు సంబంధించిన యూట్యూబ్ చానెల్‌కు సబ్ స్క్రైబ్ అయ్యారు. ఎంతో పాపులర్ వ్యక్తులు పెట్టిన యూట్యూబ్ ఛానెల్‌కు ఇంత మంది సబ్ స్క్రైబర్స్ లేరు. కానీ టిక్‌టాక్‌తో ఫేమసైన దుర్గారావు మాత్రం కేవలం పదిహేను రోజుల్లో ఈ ఘనత సాధించడం విశేషం.  దీంతో దుర్గారావు దంపతులు .. తమ యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

First published:

Tags: Jabardasth comedy show, Tik Tok Star Durga Rao, Tollywood

ఉత్తమ కథలు