టిక్ టాక్‌లో తనకు మాత్రమే సాధ్యమయ్యే డ్యాన్స్ మూమెంట్స్‌తో యమ పాపులర్ అయినా దుర్గారావు తాజాగా జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది స్కిట్‌లో దర్శన మిచ్చిన దుర్గారావు.. అక్కడ కూడా అదరగొట్టాడు. ఉన్నది కొద్ది సేపే అయినా తన ప్రజెన్స్‌తో కేక పుట్టించాడు. అది అలా ఉంటే.. మరో కామెడీ షో అదిరిందిలోకి కూడా దుర్గారావు ఎంట్రీ ఇచ్చాడు. ఆ షూట్‌లో భాగంగా దుర్గారావు.. నాది నాక్కిలీసు గొలుసు అంటూ పలాస సినిమాలో సూపర్ పాపులర్ అయినా సాంగ్‌కు తన సిగ్నేచర్ స్టెప్స్‌తో కేక పెట్టించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది. టిక్ టాక్ యాప్ ఉన్నప్పుడు తన భార్యతో కలిసి తెలుగు సినిమా పాటలకు స్టెప్స్ వేస్తూ.. దానికి తగ్గట్లుగా మేకప్, క్యాస్టూమ్స్ మార్చుతూ అదరగొట్టేవాడు. ఎంతలా అంటే మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ వచ్చి చేరారు.
View this post on Instagram
దుర్గరావు తన భార్యతో కలిసి వేసిన కొన్ని స్టెప్స్ ఇప్పటికి సోషల్ మీడియాలో రౌండ్స్ చేస్తున్నాయి. దుర్గారావు ఎంత ఫేమస్ అయ్యాడంటే.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్వయంగా పిలిచి తన స్కిట్‌లో అవకాశం ఇచ్చాడు. ఎప్పటినుండో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న దుర్గరావుకు ఇప్పుడైన కాలం కలిసి వచ్చి సినిమాల్లో ఛాన్స్ వస్తే అదరగొడుతానని అంటున్నాడు. చూడాలి మరి దుర్గారావు అదృష్టం ఎలా ఉందో..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tik tok