news18-telugu
Updated: November 25, 2020, 7:47 PM IST
ప్రతీకాత్మకచిత్రం
టిక్ టాక్ ద్వారా ప్రపంచానికి పరిచయమైన దుర్గారావు దంపతులు ఇప్పుడు మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైపోయారు. ఇన్ని రోజులు టిక్ టాక్ యాప్ ద్వారా షార్ట్ వీడియోస్ ద్వారా ప్రపంచానికి పరిచయమైన దుర్గారావు దంపతులు తాజాగా యూట్యూబ్ ద్వారా సైతం వీడియోలు పెట్టి మంచి ఫాలోయర్లను సంపాదిస్తున్నారు. అయితే దుర్గారావు తన ఫ్యాన్స్ ను మరింత అలరంచేందుకు కొత్త ప్రయోగాలు సైతం చేస్తున్నరు. అందులో భాగమే ప్రైవేటు సాంగ్స్, ప్రస్తుతం దుర్గారావు కపుల్, ఇద్దరూ కలిసి ఓ వీడియో ఆల్బం విడుదల చేశారు. అందులో దుర్గారావు తన విశ్వరూపం చూపించేశారు. అందులో దుర్గారావు తన వైఫ్ తో రెచ్చిపోయి స్టెప్పులు వేశారు. అందులో దుర్గారావు అన్ని హద్దులు చెరిపేసి ముద్దులు కూడా పెట్టేశాడు. దీంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. దుర్గారావులో ఈ కళలు కూడా ఉన్నాయా అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే దుర్గారావు విడుదల చేసిన ఈ వీడియో ఆల్బం మంచి పేరుతెచ్చుకుంది.
అయితే ఈ వీడియో ఆల్బం వెనుక గెటప్ శ్రీను సహకారం చాలా ఉందని వినిపిస్తోంది. అలాగే ఇందులో పాటను పాడింది కూడా జబర్దస్త్ ఆర్టిస్ట్ జీవన్ స్వయంగా పాడటం విశేషం. జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా సపోర్ట్ చేయడం కొసమెరుపు అనే చెప్పాలి. మరోవైపు దుర్గారావు తనకు జబర్దస్త్ కు చాలా రుణ పడి ఉంటానని చెప్పుకొచ్చాడు.
కేవలం టిక్ టాక్ కు మాత్రమే పరిమితమైన తమ జీవితం ఇఫ్పుడు ఒక సెలబ్రిటీ రేంజుకు చేరుకోవడం వెనుక సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఉన్నారని వారి సహాయం ఎప్పటికీ మరువలేమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం దుర్గారావును పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు.
Published by:
Krishna Adithya
First published:
November 25, 2020, 7:47 PM IST