హోమ్ /వార్తలు /సినిమా /

సంచలన నిర్ణయం తీసుకున్న టిక్ టాక్ దుర్గారావు...దారుణంగా మోసపోయామంటూ..కన్నీళ్లు పెట్టుకొని...

సంచలన నిర్ణయం తీసుకున్న టిక్ టాక్ దుర్గారావు...దారుణంగా మోసపోయామంటూ..కన్నీళ్లు పెట్టుకొని...

టిక్ టాక్ దుర్గా రావు (Tiktok Durga Rao)

టిక్ టాక్ దుర్గా రావు (Tiktok Durga Rao)

మొబైల్ కెమెరాకు స్టేజీ మీద పది మంది ముందు చేసే పెర్ఫార్మెన్స్ కు చాలా తేడా ఉంటుంది. దీంతో దుర్గారావు అనుకున్నంత రేంజులో రాణించలేకపోతున్నారు. అంతేకాదు సినిమా చాన్సులు కూడా వస్తాయని దుర్గారావు దంపతులు భావించారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు.

ఇంకా చదవండి ...

టిక్ టాక్ ద్వారా విపరీతంగా ఇటీవల క్రేజ్ తెచ్చుకున్న దుర్గారావు దంపతులు. తమ ఇంటిలోనే అందుబాటులో ఉన్న సదుపాయాలతో టిక్ టాక్ వీడియోలు చేసి అనేక పాటలకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. అటు సోషల్ మాడియాలో వీళ్ళకి కొన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అటువంటిది వీరు “నాది నక్లెస్ గొలుసు” అనే పాటతో బాగా పాపులర్ అయ్యారు. దీంతో వీరి పాపులారిటీ ని వాడుకునేందుకు అన్ని టీవీ చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ బాగా ట్రై చేశాయి. అంతేకాదు ప్రత్యేకంగా జబర్దస్త్ టీమ్ వెన్నుతట్టి ప్రోత్సహించింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని దుర్గారావు దంపతులు హైదరాబాద్ వచ్చేందుకు సహాయం చేశారు. ఇదిలా ఉండగా ఈ దంపతులను సుడిగాలి సుదీర్ జబర్దస్త్ షో లో తీసుకురావటానికి ప్రత్యేకంగా దుర్గారావు ఇంటికి కారు పంపించి మరి హైదరాబాద్ కి వచ్చేలా చేశారు.

ఆ తర్వాత జబర్దస్త్ హైపర్ ఆది స్కిట్ లో దుర్గారావు దంపతులు కనిపించి సందడి చేశారు. ఈ స్కిట్ ప్రోమో చూసి అప్పట్లో చాలామంది ఇంకా దుర్గారావు తలరాత మారిపోయినట్లే అని భావించారు. తీరా స్కిట్ లో ప్రోమో లో చూపించిన రీతిగానే దుర్గారావుకి స్టేజిపై హైపర్ ఆది కొన్ని సెకన్ల పాటే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా మల్లెమాల దసరా, దీపావళి ఈవెంట్లలో దుర్గారావు దంపతులకు చాన్సులు ఇచ్చారు. అయితే దుర్గారావు దంపతులు టిక్ టాక్ లో చేసినట్లు బయట చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మొబైల్ కెమెరాకు స్టేజీ మీద పది మంది ముందు చేసే పెర్ఫార్మెన్స్ కు చాలా తేడా ఉంటుంది. దీంతో దుర్గారావు అనుకున్నంత రేంజులో రాణించలేకపోతున్నారు. అంతేకాదు సినిమా చాన్సులు కూడా వస్తాయని దుర్గారావు దంపతులు భావించారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు.

దీంతో ఎన్నో ఆశలు పెట్టుకుని హైదరాబాద్ వెళ్ళిన దుర్గారావు కి పెద్దగా అవకాశం రాకపోవడంతో, తన స్వగ్రామానికి తిరిగివచ్చేశాడు. అనవసరంగా ఊర్లో పనులు మానుకుని వెళ్ళినట్లు దుర్గారావు దంపతులు బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ తర్వాత “ఢీ షో" లో అవకాశం ఉంటుందని మిగతావాళ్లు చెప్పిన గాని దుర్గారావు దంపతులు ఆ మాటలు పట్టించుకోకుండా తిరిగి తమ సొంత ఊరికి వచ్చేసినట్లు టాక్. ఇప్పటి నుంచి కేవలం యూట్యూబ్ కు మాత్రమే పరిమితమవుతున్నట్లు దుర్గారావు చెప్పడం విశేషం.

First published:

Tags: Tik Tok Star Durga Rao

ఉత్తమ కథలు