Bhaghi 3 Trailer: టైగర్ ష్రాఫ్ ‘భాఘీ 3’ ట్రైలర్ టాక్.. అన్న కోసం తమ్ముడి పోరాటం..

నిర్మాత సాజిద్ ఖాన్ కూడా ఇదే విషయం బన్నీని నేరుగా అడిగినట్లు ప్రచారం జరుగుతుంది.

Bhaghi 3 Trailer | బాలీవుడ్‌లో ‘బాఘీ’ సినిమాతో హీరోగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టైగర్ ష్రాఫ్.. ఆ తర్వాత ‘భాఘీ 2’ సినిమాతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకున్నాడు. తాజాగా ఈ సిరీస్‌లో ‘భాఘీ 3’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.

  • Share this:
    Bhaghi 3 Trailer | deబాలీవుడ్‌లో ‘బాఘీ’ సినిమాతో హీరోగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టైగర్ ష్రాఫ్.. ఆ తర్వాత ‘భాఘీ 2’ సినిమాతో మరో హిట్టును తన అకౌంట్‌లో వేసుకున్నాడు. తాజాగా ఈ సిరీస్‌లో ‘భాఘీ 3’ సినిమా తెరకెక్కింది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియావాలా నిర్మించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమా అన్నదమ్ముల అనుబంధానికి యాక్షన్ జోడించి తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ అన్నగా రితేశ్ దేశ్‌ముఖ్ నటించాడు. ఇక ఈ చిత్రంలో మరోసారి టైగర్ ష్రాఫ్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ  ట్రైలర్‌లో టైగర్ ష్రాఫ్ మరోసారి తన యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టాడు. ఇక హీరో అన్న రితేశ్ ఉద్యోగ రీత్యా సిరియా వెళతాడు. అక్కడ ఉగ్రవాదుల చేతిలో బందీ అవుతాడు. అన్నయ్యను విడిపించుకోవడానికి ఉగ్రవాదులతో పోరాడటానికి హీరో సిరియా వెళతాడు. ఈ పోరాటంలో ఉగ్రవాదులతో పోరాడి హీరో తన అన్నను రక్షించుకున్నాడా లేదా అనేది ‘భాఘీ 3’ స్టోరి.



    గతంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఖిలాడీయోంకా ఖిలాడీ’ సినిమా కూడా అన్నదమ్ముల నేపథ్యంలో WWF నేపథ్యంలో ఇలాంటి నేపథ్యంలో తెరకెక్కింది. మొత్తానికి ‘భాఘీ 3’లో టైగర్ యాక్షన్ చూడాలంటే మార్చి 6 వరకు వెయిట్ చేయాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: