‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీలో అమితాబ్ లుక్ రిలీజ్

‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీలో అమితాబ్ క్యారెక్టర్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ మూవీలో బిగ్ బీ...‘ఖుదాబక్ష్’ అనే సర్థార్ పాత్రలో నటిస్తున్నాడు. ‘ఖుదాభక్ష్’గా అమితాబ్ లుక్ చాలా టెర్రిఫిక్‌గా ఉంది.

news18-telugu
Updated: September 18, 2018, 3:06 PM IST
‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీలో అమితాబ్ లుక్ రిలీజ్
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్(యూట్యూబ్ క్రెడిట్)
  • Share this:
ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ ఒకటి. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న ఈ మూవీపై బీటౌన్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో కత్రినా కైఫ్, ఫాతిమా సనాషేక్, జాకీష్రాఫ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ టైటిల్ లోగోకు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

లేటెస్ట్‌గా ఈ మూవీలో అమితాబ్ క్యారెక్టర్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ మూవీలో బిగ్ బీ...‘ఖుదాబక్ష్’ అనే సర్థార్ పాత్రలో నటిస్తున్నాడు.  ‘ఖుదాభక్ష్’గా అమితాబ్ లుక్ చాలా టెర్రిఫిక్‌గా ఉంది.

19 శతాబ్ధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. 1839లో ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన ‘కన్ఫెషన్స్ ఆప్ ఎ థగ్’ అనే నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ రాజస్థాన్ సంచార తెగలకు సంబంధించిన బందిపోటు దొంగల స్టోరీ.ఈ బందిపోటు ముఠా,..బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని 3డీ, ఐమాక్స్ ఫార్మాట్స్‌లో హిందితో పాటు తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.
First published: September 18, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు