అమితాబ్, అమీర్‌ల సినిమా నుంచి మరో లుక్ విడుదల

ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ ఒకటి. బాహుబలి సినిమాను ప్రమోషన్ చేసిన విధంగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ నుంచి రోజుకో క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేస్తూ ఈ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు.

news18-telugu
Updated: September 19, 2018, 12:30 PM IST
అమితాబ్, అమీర్‌ల సినిమా నుంచి మరో లుక్ విడుదల
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్
  • Share this:
ఈ యేడాది బాలీవుడ్‌లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ ఒకటి. బాహుబలి సినిమాను ప్రమోషన్ చేసిన విధంగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీ నుంచి రోజుకో క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేస్తూ ఈ మూవీపై అంచనాలు పెంచేస్తున్నారు.

ఈ మంగళవారం ‘ఖుదాబక్ష్’ గా నటిస్తోన్న అమితాబ్ క్యారెక్టర్‌ను రివీల్ చేసిన ఈ మూవీ మేకర్స్...లేటెస్ట్‌గా చేతిలో విల్లుతో యుద్ధం చేస్తోన్న ఫాతిమా సనా షేక్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో ఫాతిమా..‘జఫీరా’ అనే పాత్రలో నటిస్తుందనే విషయాన్ని ఈ మోషన్ పోష్టర్‌లో చూపించారు.





అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్‌ ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తోన్న ఈ మూవీపై బీటౌన్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో కత్రినా కైఫ్, జాకీష్రాఫ్‌ నటిస్తున్నారు.19 శతాబ్ధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. 1839లో ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన ‘కన్ఫెషన్స్ ఆప్ ఎ థగ్’ అనే నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ రాజస్థాన్ సంచార తెగలకు సంబంధించిన బందిపోటు దొంగల స్టోరీ. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్  చేస్తోన్న ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి

‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మూవీలో అమితాబ్ లుక్ రిలీజ్

అమితాబ్, ఆమిర్‌ల ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ మోషన్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్‌లో జెండా ఎగరేసిన తెలంగాణ హీరోలు, దర్శకులు

 
First published: September 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు