Kangana Ranaut: కంగనా రనౌత్ బాలీవుడ్ రెబల్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీతో గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది. ఆ మధ్య బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కంటే టాలీవుడ్ చిత్ర పరిశ్రమనే గ్రేట్ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతి పక్కనపెడితే.. ఈమె ప్రస్తుతం తన దృష్టిని సినిమాలపై కేంద్రీకరించింది. ప్రస్తుతం కంగాన జయలలిత జీవిత చరిత్రపై తెరకెక్కుతోన్న ‘తలైవి’ సినిమా చేస్తోంది. ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

తలైవి షూటింగ్లో కంగనా (Twitter/Photo)
ఈ నేపథ్యంలో కంగానను అత్యాచారం చేస్తామంటూ ఓ వ్యక్తి బెదిరించాడు. ప్రస్తుతం కంగనా తన బ్రదర్ మ్యారేజ్ పనుల్లో బిజీగా ుంది. ఈ మ్యారేజ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్గా కంగనా షేర్ చేసిన ఫోటోలను వీడియోలపై ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది తన ఫేస్బుక్ పేజీలో కంగనా.. నీ ఓవర్ యాక్షన్ చాలు.. లేకపోతే నడిరోడ్డుపై అత్యాచారం చేస్తానంటూ బెదిరించాడు. ఐతే.. సదురు లాయర్ మాత్రం తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి తన అకౌంట్ ద్వారా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అతను వ్యాఖ్యానించాడు. నాకు సమాజం, స్త్రీలపై ఎంతో గౌరవం ఉందన్నారు. అంతేకాదు నా అకౌంట్ నుండి ఎవరికైనా ఎలాంటి అసభ్యకరమైన కామెంట్స్ వలన ఎవరైనా ఏదైనా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసి ఉంటే.. క్షమించమని వేడుకున్నాడు. అంతేకాదు తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ముందు ముందు ఇలాంటి సందేశాలు రాకూడదనే ఉద్దేశ్యంతో తన అకౌంట్‌ను డిలీట్ చేసారు. ఈ వ్యాఖ్యలపై కంగనా ఎలాంటి స్పందన వ్యక్త పరచలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 21, 2020, 13:17 IST