జబర్దస్త్ షో నుంచి ఆ ఇద్దరు ఔట్.. హైపర్ ఆదికి షాక్..?

Jabardasth Comedy Show: ఈ రోజు స్టేటస్ అనుభవిస్తున్న సుధీర్, హైపర్ ఆది లాంటి చాలా మంది కమెడియన్లు ఈ షో నుంచే వచ్చారు. ఇంకా ఎంతోమందికి జబర్దస్త్ కామెడీ షో అన్నం పెడుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2020, 6:46 PM IST
జబర్దస్త్ షో నుంచి ఆ ఇద్దరు ఔట్.. హైపర్ ఆదికి షాక్..?
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోకు చాలా మంచి ఇమేజ్ ఉంది. ఇలాంటి కామెడీ షో రావడం వల్లే చాలా మంది నటులు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యారు. ఈ రోజు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి చాలా మంది కమెడియన్లు ఈ షో నుంచి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇంకా ఎంతోమందికి జబర్దస్త్ కామెడీ షో అన్నం పెడుతుంది. ఇప్పటి వరకు కేవలం నవ్వులతోనే ఎక్కువగా పరిచయమున్న ఈ షో కొన్ని రోజులుగా కాంట్రవర్సీ కూడా అవుతుంది. ఇందులో నటించే ఇద్దరు కమెడియన్లు ఆ మధ్య వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు కూడా. హైపర్ ఆది టీంలో చేసే దొరబాబు, పరదేశీ వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు.
వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన జబర్దస్త్ నటులు (Dora Babu Paradeshi prostitution)
వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన జబర్దస్త్ నటులు (Dora Babu Paradeshi prostitution)


దాంతో మిగిలిన జబర్దస్త్ కమెడియన్లపై కూడా ఈ ప్రభావం పడేలా కనిపిస్తుంది. అందరిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దొరబాబు, పరదేశీపై ఇప్పుడు మల్లెమాల టీం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా హైపర్ ఆది టీం ఈ ఇద్దరూ కనిపించారు కానీ ఇప్పుడు మాత్రం వీళ్లను బయటికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది టీంలో పరదేశీకి అంత క్రేజ్ లేదు కానీ దొరబాబు మాత్రం చాలా సీనియర్.. మంచి కమెడియన్ కూడా. అతడిపై ఎప్పుడూ అలాంటి జోకులే వస్తుంటాడు ఆది. ఇప్పుడు అదే నిజం చేసుకున్నాడు దొరబాబు.
దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్ధస్త్ కామెడీ షో‌లో మార్పులు (Twitter/Photo),
దొరబాబు ఎఫెక్ట్‌తో జబర్ధస్త్ కామెడీ షో‌లో మార్పులు (Twitter/Photo),


జబర్దస్త్‌లోకి రాకముందు కూడా ఈయన యూ ట్యూబ్‌లో బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. దాంతో అదే జోకులు ఇక్కడ కూడా వేసేవాడు హైపర్ ఆది. అలాగే ఎక్కువ కామెడీ పుట్టించేవాడు. ఆ కేసులో దొరికిన తర్వాత కూడా హైపర్ ఆది మాట్లాడి సెట్ చేసాడు. అయితే మల్లెమాల టీం మాత్రం నెక్ట్స్ షెడ్యూల్స్ నుంచి వీళ్లు వద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. అందరికీ ఇదే వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బయట ఈవెంట్స్ ఒప్పుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని.. ముందు వెనక చూసుకుని అటు వైపు వెళ్లాలని మల్లెమాల సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. దొరబాబు కానీ బయటికెళ్తే ఆదికి పెద్ద దెబ్బే.
First published: April 11, 2020, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading