అందుకే పుష్ప సినిమాను రిజెక్ట్ చేసిన సమంత..

రంగస్థలంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ సుకుమార్ డైరక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.

news18-telugu
Updated: July 2, 2020, 12:21 PM IST
అందుకే పుష్ప సినిమాను రిజెక్ట్ చేసిన సమంత..
సమంత Photo : Twitter
  • Share this:
రంగస్థలంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ సుకుమార్ డైరక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప. అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా రావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. దీనికి తోడు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే సినిమాను ముందు తెలుగులోనే విడుదల చేయాలని భావించిన చిత్రబృందం.. ఆ తర్వాత మార్కెట్ పరంగా కథలో కొన్ని మార్పులు చేసి నేషనల్ వైడ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా వరుసగా హిట్ సినిమాలతో అదరగొడుతోన్న కన్నడ భామ రష్మిక మందన్న చేస్తోంది. వస్తోన్న సమాచారం మేరకు మొదట ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకున్నారట. ఆల్రెడీ సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో మెప్పించింది సమంత. అయితే పుష్ప సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర దాదాపు రామలక్ష్మి పాత్రకు దగ్గరగా ఉంటుందని సమంత ఈ సినిమాకు నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. అయితే పాత్ర ఒకేలా ఉన్నా సుక్కు టేకింగ్ వేరేలా ఉంటుంది కాబట్టి పుష్ప ఛాన్స్ సమంత ఓకే చేసి ఉంటే బాగుండేదని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇక సమంత పోయిన సంవత్సరం మజిలీ, ఓ బేబీ లాంటీ సినిమాలతో అదరగొట్టింది. అయితే ఈ సంవత్సరం జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ప్రస్తుతం కథల విషయంలో ఆచి తూచి సెలెక్ట్ చేస్తుంది. అందులో భాగంగా తమిళంలో విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో సినిమా మాత్రమే ఓకే చేసిన సమంత తెలుగులో విక్రమ్ కుమార్, నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తోన్న థాంక్యూ సినిమా చేస్తుందని టాక్. వీటికి తోడు అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సీరీస్ సీజన్ 2లో కీలకపాత్రలో కనిపించనుంది.
First published: July 2, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading