Home /News /movies /

THIS IS THE REASON DIL RAJU NOT INTERESTED TO RELEASE ON OTT SR

OTT Release : వి సినిమా విషయంలో దిల్ రాజు వెనుకడుగు అందుకే..

దిల్ రాజు Photo : Twitter

దిల్ రాజు Photo : Twitter

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వి.

    నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వి. యాక్షన్ ఎంటర్టైనర్ జానర్‌లో వస్తోన్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సిఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు ఉగాది కానుకగా విడుదల చేయాలనీ ప్లాన్ చేశాడు. అయితే దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదాపడింది. ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే ఆ చిత్ర నిర్మాత భారిగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ముందే విడుదల ప్లాన్ చేసిన కొన్ని సినిమాలు ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి. అందులో భాగంగా అమృతరామమ్ అనే ఓ సినిమా ఇప్పటికే డిజిటల్ విడుదలై పరవాలేదనిపించింది. ఈ కోవాలోనే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలోకి విడుదలకు సిద్ధమయ్యాయి. అంతేందుకు ఆ మధ్య రామ్ నటించిన రెడ్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుందని టాక్ నడిచింది. కానీ ఎందుకో చిత్ర నిర్మాత డిజిటల్‌లో విడుదలకు నో చెప్పాడు. మరో సినిమా వి కూడా డిజిటల్‌లో విడుదల చేయాలనీ చూసారు. అంతేకాదు ఈ విషయంలో దిల్ రాజు కూడా సుముఖంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత ఓటీటీ విడుదల విషయంలో వెనకడుగు వేస్తున్నాడట. విషయం ఏమంటే.. దిల్ రాజు నిర్మాత కాక ముందు ఒక డిస్ట్రిబ్యూటర్‌గా రాణించాడు. అంతేకాదు ఇప్పటికి కూడా నైజాంలో చాలా థియేటర్స్ ఆయన అధీనంలో ఉన్నాయి. దీనికి తోడు దిల్ రాజు పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఆయన నిర్మించిన వి సినిమాను ఓటీటీకి అమ్మితే అది ఆయనకే నష్టం కలిగించే విధంగా మారనుందని సమాచారం. థియేటర్స్ మనుగడకు ఇబ్బందిగా మారిన ఓటీటీని ప్రోత్సహించే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని భావించిన దిల్ రాజు తన సినిమాను ఓటీటీ అమ్మకుండా కొంత లేటైనా డైరెక్ట్‌గా థియేటర్స్‌లోనే విడుదల చేయాలనీ చూస్తున్నాడట.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Dil raju, Nani, Sudheer Babu

    తదుపరి వార్తలు