THIS IS THE REASON BEHIND RAHUL RAMAKRISHNA BEARD LOOK HERE IS DETAILS MNJ
Rahul Ramakrishna: రాహుల్ గడ్డం, జుట్టు పెంచడం వెనుక కారణమిదే.. ఇంకెన్ని రోజులు అలానే ఉండాలంటే
రాహుల్ రామకృష్ణ
టాలెంటెడ్ నటుడు రాహుల్ రామకృష్ణ గత రెండేళ్లుగా ఒకే లుక్‌లో ఉన్నారు. గడ్డం, జుట్టు పెంచేసి అదే లుక్‌ని మెయిన్‌టెన్ చేస్తున్నారు. పలు సినిమాల్లోనూ అలానే కనిపించారు. అయితే ఈ నటుడు ఈ లుక్‌లో ఉండటం వెనుక ఒక కారణం ఉందట. అంతేకాదు ఆ గడ్డం తీసేందుకు మోక్షం ఎప్పుడు రానుందంటే..
Rahul Ramaksishna: అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించుకున్న నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. అర్జున్ రెడ్డి మూవీ ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ఆ తరువాత.. గీత గోవిందం, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇక ఇటీవల విడుదలై థియేటర్లలో దూసుకుపోతున్న జాతి రత్నాలులో కనిపించాడు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శిలతో కలిసి రాహుల్ చేసిన సందడి అందరి చేత నవ్వులు పూయిస్తోంది. ఇదంతా పక్కనపెడితే దాదాపు రాహుల్ గత రెండు సంవత్సరాలుగా గడ్డం, జుట్టుతో ఉన్నాడు. జాతి రత్నాలు సినిమాలో కూడా అలానే కనిపించాడు. అయితే ఏదో కొన్ని నెలలు అంటే ఏదో సినిమా కోసం అనుకోవచ్చు కానీ.. రాహుల్ మాత్రం రెండేళ్లుగా అలానే ఉన్నాడు. దీంతో రాహుల్ ఎందుకు అలా ఉండిపోయాడు అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే రాహుల్ గడ్డం, జుట్టు పెంచడం వెనుక కారణం ఏంటంటే ఆర్ఆర్ఆర్.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఓ కీలక పాత్రలో రాహుల్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్ అనుచరుడిగా ఇతడు కనిపించనున్నాడట. ఇక ఈ పాత్ర సినిమాలో చాలా సేపు ఉండనుందట. ఈ క్రమంలోనే రాహుల్ గడ్డం, జుట్టును పెంచాడు. ఈ సినిమాకు ఒప్పుకున్నప్పుడే గడ్డం, జుట్టును తీయనని రాహుల్‌తో రాజమౌళి అగ్రిమెంట్ తీసుకున్నారట. ఈ క్రమంలో అలానే పెంచాడట.
అయితే మధ్యలో కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టగా.. దాదాపు ఏడు, ఎనిమిది నెలల పాటు అందరూ షూటింగ్‌లకు దూరమయ్యారు. ఆ సమయంలో తీసేయాలనుకున్నా మళ్లీ లుక్ పోతుందన్న భావనతో రాహుల్ అలానే ఉండిపోయారట. రాహుల్‌నే కాదు ఈ మూవీలో ప్రధాన పాత్రాధారులు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కూడా లాక్డౌన్లో తమ లుక్‌ని మార్చుకోలేదు. అసలే జక్కన్న చిత్రం కావడంతో మళ్లీ ప్రయోగాలు వద్దని వారు అలానే ఉండిపోయారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌కి పూర్తి కానుంది. అప్పటి వరకు రాహుల్ ఇలానే ఉండనున్నారట. ఆ తరువాతనే గడ్డం, జుట్టు తీసుకునేందుకు అతడికి మోక్షం రానుందని సమాచారం. కాగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.