• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • THIS IS THE MAIN STORY BEHIND CHIRANJEEVI MEHER RAMESH MOVIE PK

చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ వెనక అసలు స్టోరీ..

చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ వెనక అసలు స్టోరీ..

చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)

Chiranjeevi Meher Ramesh: హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా చిరంజీవి అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి.

  • Share this:
హెడ్డింగ్ చూసిన తర్వాత కచ్చితంగా చిరంజీవి అభిమానులకు కాస్తో కూస్తో కంగారు ఖాయం కదా. ఎందుకంటే పాపం మెహర్ రమేష్ జాతకం అలా ఉంది మరి. తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేక.. నిర్మాతలను కూడా నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పారిపోతున్నారు. ఈయన చేసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో అన్నీ ఫ్లాపులే.

చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)
చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)


దాంతో మెహర్ రమేష్‌ను నమ్మడం పూర్తిగా మానేసారు నిర్మాతలు. ముఖ్యంగా షాడో సినిమా వచ్చి ఏడేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు. మెగా కుటుంబానికి బంధువు కాబట్టి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు ఈయన. ఎలాగూ యాక్షన్ సీన్స్ బాగా చిత్రీకరిస్తాడని పేరుండటంతో పెద్ద సినిమాలకు అవి తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో మెహర్ రమేష్ పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయాడు.

మెహర్ రమేష్ మహేష్ బాబు (Source: Twitter)
మెహర్ రమేష్ మహేష్ బాబు (Source: Twitter)


ఆ మధ్య నమ్రత నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తాడనే వార్తలు వచ్చినా కూడా అవి కూడా నిజం కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నాడు మెహర్. ఆయనతోనే యాడ్స్ కూడా చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరంజీవి బాంబ్ పేల్చాడు. తనకు కుర్ర దర్శకులతో పని చేయాలని ఉందని.. వాళ్ల ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఉందని చెప్పాడు మెగాస్టార్. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాను కొందరు దర్శకులు చెప్పిన కథలను విన్నానని.. అందులో కొరటాల శివ సినిమా జరుగుతుంది.. నెక్ట్స్ సుజీత్, బాబీ సినిమాలున్నాయని చెప్పాడు చిరంజీవి.

చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)
చిరంజీవి మెహర్ రమేష్ (meher ramesh chiranjeevi)


ఆ వెంటనే మెహర్ రమేష్ పేరు కూడా వచ్చింది. ఈయన చెప్పిన కథ కూడా విన్న చిరు.. బాగుందని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. మెహర్ రమేష్ మెగా కంపౌండ్‌లో సినిమా చేస్తుండటం నిజమే కానీ అది చిరంజీవితో, రామ్ చరణ్‌తో కాదు. ఓ చిన్న సినిమా చేసి ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. దీన్ని బట్టి తర్వాత పెద్ద ఆఫర్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు అయితే మాత్రం మెహర్ రమేష్, చిరంజీవి సినిమా ఉండకపోవచ్చు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు