THIS IS THE CONTESTANT WILL ELIMINATE THIS WEEK IN BIGG BOSS SEASON 5 TELUGU NR
Bigg Boss 5 Telugu Elimination: మొదటి ఎలిమినేషన్‌లో బయటికి రాబోతున్న కంటెస్టెంట్ ఎవరంటే?
Bigg Boss 5 Telugu Elimination
Bigg Boss 5 Telugu Elimination: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలయ్యింది. ఇప్పటికే నాలుగు సీజన్ లు మంచి విజయవంతంగా పూర్తవగా ఇటీవలే సీజన్ ఫైవ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.
Bigg Boss 5 Telugu Elimination: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలయ్యింది. ఇప్పటికే నాలుగు సీజన్ లు మంచి విజయవంతంగా పూర్తవగా ఇటీవలే సీజన్ ఫైవ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు. చాలా వరకు అందరూ పరిచయమున్న సెలబ్రిటీలే కాగా.. ఇక మరికొందరి గురించి తెగ సర్చ్ లు చేస్తున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే మొదటి ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యే పర్సన్ పేరు ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ ఐదవ సీజన్ మొదటి రోజు నుండి మంచి హవాతో ప్రారంభమైంది. కంటెస్టెంట్ లు తమ పరిచయాన్ని పూర్తిగా పెంచుకోక ముందుకే గొడవలోకి దిగుతున్నారు. అంతేకాదండోయ్ గ్రూపులుగా కూడా భాగాలు అవుతున్నారు. ఇక మొత్తానికి ఎలిమినేషన్ రౌండ్ కూడా పూర్తయింది. దీంతో మొదటి ఎలిమినేషన్ రౌండ్ లో ఆరుగురు కంటెస్టెంట్ ల పేర్లు నామినేట్ లిస్టులో చేరాయి.
అందులో యాంకర్ రవి, ఆర్జే కాజల్, హమీద, జశ్వంత్ (జెస్సీ), మానస్, సరయు ఉన్నారు. ఇక ఇందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు బాగా వైరల్ గా మారింది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు మోడల్ జశ్వంత్ అని తెలుస్తుంది. ఈయన మొదట్లో చాలా సైలెంట్ గా కనిపించడంతో ప్రేక్షకుల మైండ్ లో అమాయకుడని ముద్ర పడింది. కానీ అంతలోనే ఆ ముద్రను చెడిపి వేసుకున్నాడు జశ్వంత్.
మరో కంటెస్టెంట్ అనీ మాస్టర్ తో బాగా రెచ్చిపోయాడు. ఆమెతో గొడవ పడుతూ కంటెస్టెంట్ లతో పాటు ప్రేక్షకులను కూడా షాక్ అయ్యేలా చేశాడు. దీంతో అమాయకుడు అనుకున్నా ప్రేక్షకులే సామాన్యుడు కాదు అని మరో ముద్రవేశారు. దాంతో ఈయనకు రావాల్సిన ఓట్లన్నీ తగ్గిపోయాయని తెలిసింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఇతడిపై ట్రోలింగ్స్, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో మొదటి ఎలిమినేషన్ రౌండ్ లో జశ్వంత్ బిగ్ బాస్ ఇంటి నుండి తన ఇంటి దారి పట్టడానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వారం ఆఖరి వరకు వేచి చూడాల్సిందే.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.