రేస్ 3 సినిమాకి సల్మాన్ ఎంత తీసుకున్నాడో తెలుసా...

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:23 PM IST
రేస్ 3 సినిమాకి సల్మాన్ ఎంత తీసుకున్నాడో తెలుసా...
Salman khan in ‘ Race 3’
  • News18
  • Last Updated: June 6, 2019, 2:23 PM IST
  • Share this:
ప్రతీ రంజాన్ పండగకి తన సినిమా ఒకటి ఉండేలా చూసుకోవడం, ఆ సినిమా హిట్టుతో పండగ సంబరాలు చేసుకోవడం సల్లూభాయికి అలవాటు. అయితే ఆ సంప్రదాయానికి గత ఏడాది బ్రేక్ పడింది. వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర విజయయాత్ర చేస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ కి ఊహించిన షాక్ ఇచ్చింది గత ఏడాది రంజాన్ కి విడుదలయిన ‘ట్యూబ్ లైట్’ చిత్రం. ఈ ఏడాది కూడా రేస్- 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు సల్మాన్.

గత ఏడాది రంజాన్ కి భారీ అంచనాలతో స్వయంగా నిర్మించిన ‘ట్యూబ్ లైట్’ చిత్రాన్ని విడుదల చేశాడు సల్మాన్. ఈ సినిమాతో టాలీవుడ్ వండర్ ‘బాహుబలి’ సినిమా రికార్డులన్నీ బద్దలుకొడతానంటూ ప్రగల్భాలు కూడా పలికాడు. అయితే విడుదల తర్వాత కనీస వెలుగులు కూడా చూపించలేక, తుస్సుమనింది ట్యూబ్ లైట్. అయితే ఆ తర్వాత సల్లూ భాయ్ నటించిన ‘టైగర్ జిందా హై’ సినిమా విడుదలయ్యి, మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సారి రంజాన్ సెంటిమెంటుతో ‘రేస్ - 3’ చిత్రాన్ని జూన్ 15న విడుదల చేస్తున్నాడు సల్మాన్. రేస్ సిరీస్లో మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎబీసీడీ’ చిత్ర దర్శకుడు రెమో డిసౌజా తెరకెక్కిస్తున్నాడు. మొదటి రెండు సిరీస్ లకు అబ్బాస్ ముస్తాన్ దర్శకత్వం వహించగా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ద్వారా సల్మాన్ ఖాతాలో 100 నుంచి 125 కోట్ల దాకా చేరినట్టు సమాచారం. ఇప్పటికే నిర్మాత రమేష్ తురానీ నుంచి భారీ మొత్తానికి చెక్కు అందిందట సల్మాన్ కి. సినిమా విడుదలయ్యాక బిజినెస్ ను బట్టి మరికొంత ముట్టజెప్పబోతున్నాడు నిర్మాత. అంతేకాకుండా రేస్-3 చిత్రానికి సల్మాన్ సహా- నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ‘సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్’ పతాకంపై నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు.

శాటిలైట్ హక్కులు- సంగీత హక్కులు- బాక్సాఫీస్ కలెక్షన్లలో షేర్ మొత్తం కలుపుకుని చూస్తే సల్మాన్ కి 100 నుంచి 125 దాకా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారిక సమాచారం.


‘ట్యూబ్ లైట్’ సినిమా ద్వారా పొగొట్టుకున్న మొత్తానికి రెట్టింపు ఆదాయం ‘రేస్ 3’ చిత్రం తెచ్చినట్టే! బాలీవుడ్లో ఒక హీరో, ఒకే సినిమా ద్వారా వంద కోట్లు అంతకు మించి ఆర్జించడం అంటే ఓ రకంగా రికార్డే. అనిల్ కపూర్, జాక్వెలిస్ ఫెర్నాండేజ్ వంటి తారలు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రేస్ 3’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోగలిగితే మాత్రం సల్లూభాయ్ పండగ సంబరాలు ఓ రేంజులో ఉండడం ఖాయం.
Published by: Ramu Chinthakindhi
First published: June 6, 2018, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading