రానా మిహికల ప్రేమ బంధానికి కారణం.. ఆ అమ్మాయేనట..

రానా దగ్గబాటి, మిహిక బజాజ్‌ల ప్రేమ బంధం వివాహ బంధంతో ఒకటికానుంది.

advertorial
Updated: May 23, 2020, 11:50 AM IST
రానా మిహికల ప్రేమ బంధానికి కారణం.. ఆ అమ్మాయేనట..
ఇప్పుడు అసలు వీళ్ల ప్రేమకథ ఎప్పుడు ఎలా మొదలైందబ్బా అంటూ ఆరా తీస్తున్నారు. దీనికి సమాధానం ఈ మధ్యే తెలిసింది. రానా సన్నిహితుల చెప్తున్న దాన్నిబట్టి ముంబైలో జరిగిన ఓ బాలీవుడ్ పార్టీలో మిహికాను కలుసుకున్నాడు రానా. పైగా ఈమె వెంకీ కూతురుకు స్నేహితురాలు కూడా.
  • Share this:
రానా దగ్గబాటి, మిహిక బజాజ్‌ల ప్రేమ బంధం వివాహ బంధంతో ఒకటికానుంది. అందులో భాగంగా తాజాగా బంధువుల సమక్షంలో ఈ ప్రేమ జంట రోకా వేడుకను వైభవంగా జరుపుకుంది. ఇక అతి త్వరలోనే వీరి వివాహ నిశ్చితార్ధం పెళ్లి జరగనున్నాయి. వస్తున్న సమాచారం మేరకు ఈ ఏడాది చివరన అంటే డిసెంబర్‌లో పెళ్ళిని ఘనంగా పెళ్లి నిర్వహించాలని పెద్దలు భావిస్తున్నారు. అది అలా ఉంటే చాలామందికి రానా మిహికల మధ్య ఆ ప్రేమ బంధం ఎలా ఏర్పడింది. వీరిద్దరూ ఎలా కలిసారు...  వీరి పరిచయం వెనుక ఎవరు ఉన్నారు మొదలగు అనేక అనుమానాలు ఇటు రానా అభిమానుల్లోను అటూ ఇండస్ట్రీకి చెందిన వారిలో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ కలవడానికి.. వీరి పరిచయం పెళ్లికి దాకా వెళ్లడానికి వెనుక బాబాయ్ విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఇక్కడ విశేషం ఏమంటే.. అశ్రిత  మిహిక క్లాస్ మేట్స్. దీంతో ఆమె ద్వారా రానాకు మిహికతో పరిచయం అయ్యిందట. అలా వారి పరిచయం కాస్తా లవ్‌గా మారి ప్రస్తుతం పెళ్లి దాకా వచ్చిందన్న మాట. ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం విరాట పర్వం అనే పొలిటికల్ థ్రిల్లర్‌తో పాటు అరణ్య అనే ఓ సోషల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ కారణంగా అరణ్య డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుందని తెలుస్తోంది. ఇక మరో సినిమా విరాట పర్వం సగానికిపైగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో రానాతో పాటు మరో ప్రధాన పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి నటిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: May 23, 2020, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading