అమితాబ్ బచ్చన్‌కు కరోనా అలా సోకిందా.. పెద్ద కథే ఉందిగా..

Amitabh Bachchan Corona: కరోనా వైరస్ ఇండియాలో వచ్చినప్పట్నుంచి కూడా అందర్నీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నాడు అమితాబ్ బచ్చన్. ఇండియన్ సూపర్ స్టార్స్ అంతా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 12, 2020, 7:38 PM IST
అమితాబ్ బచ్చన్‌కు కరోనా అలా సోకిందా.. పెద్ద కథే ఉందిగా..
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
  • Share this:
కరోనా వైరస్ ఇండియాలో వచ్చినప్పట్నుంచి కూడా అందర్నీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నాడు అమితాబ్ బచ్చన్. ఇండియన్ సూపర్ స్టార్స్ అంతా కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసారు. ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోండి.. బయటికి వెళ్తే కచ్చితంగా మాస్కులు వేసుకోండి.. శానిటైజ్ చేసుకోండి అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా చెప్తూనే ఉన్నాడు అమితాబ్. అన్ని జాగ్రత్తలు చెప్పిన అమితాబ్ బచ్చన్ ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నాడు.

అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)


ఆయనతో పాటు తన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా వైరస్ సోకింది. అసలు ఇంటి నుంచి కూడా కాలు బయటికి పెట్టని అమితాబ్, ఆయన కుటుంబానికి కరోనా వైరస్ ఎక్కడ్నుంచి వచ్చిందబ్బా అంటూ జుట్టు పీక్కుంటున్నారు అభిమానులు. దీని వెనక ఆసక్తికరమైన కథనం వినిపిస్తుంది. లాక్‌డౌన్ విధించిన తర్వాత అమితాబ్ అస్సలు ఇల్లు వదిలి బయటికి రాలేదు.

అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)


సడలింపు తర్వాత కూడా ఆయన చాలా జాగ్రత్తగానే ఉన్నాడు. అయితే ఒక్కసారి మాత్రం షూటింగ్స్ మొదలైన తర్వాత బయటికి వచ్చాడు బిగ్ బి. కొన్ని రోజుల క్రితం కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ కోసం ఆడిషన్స్ జరిగాయి. ముంబైలోని ఓ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని జాగ్రత్తలతోనే అమితాబ్ కూడా హాజరయ్యాడు. ఆయనే ఈ సీజన్‌కు హోస్ట్ కాబట్టి వచ్చాడు అమితాబ్ బచ్చన్.

అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)
అమితాబ్ బచ్చన్ (amitabh bachchan)


ఆ సమయంలో మాస్క్‌తో పాటు శానిటైజ్ కూడా చేసుకున్నాడు ఈయన. కానీ ఎలా వచ్చిందో తెలియదు కానీ అప్పుడే అమితాబ్‌కు కరోనా వచ్చుంటుందని అంచనా వేస్తున్నారు సన్నిహితులు. తండ్రి నుంచి కొడుకుకు వచ్చింది. ఆ తర్వాత కోడలు, మనవరాలుకు కూడా కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు సన్నిహితులు కోరుకుంటున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: July 12, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading