అవును సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఇలా జరడం మొదటి సారనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమ ా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఒకప్పటి లేడీ అమితాబ్.. విజయ శాంతి నటిగా టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తుంది. అంతేకాదు ఈ చిత్రంలో మహేష్ బాబు.. ఫస్ట్ టైమ్ ఒక మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు మహేష్ బాబు.. అన్ని సినిమాలకు దాదాపు చిన్న టైటిల్సే ఉంటాయి. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మాత్రమే మహేష్ బాబు కెరీర్లో అతిపెద్ద పేరుతో వచ్చిన సినిమా. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ విషయానికొస్తే.. ఈ చిత్రం టైటిల్.. ఒకప్పటి ఎన్టీఆర్, హీరోగా నటించిన ‘కంచుకోట’ సినిమాలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ పాట పల్లవిని ఈ సినిమా టైటిల్‌గా పెట్టారు. ఒక పాట పల్లవిని మహేష్ బాబు తన సినిమాకు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అనిచెప్పొచ్చు.
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’(Twitter/Photo)
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు. మరోవైపు ఓవర్సీస్లో ఈ చిత్రాన్ని ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ఇక సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు చిత్రాల్లో దాదాపు అన్ని సక్సెస్ సాధించాయి. ఒక్క ‘వన్ నేనొక్కడినే’ మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకోవైపు పొంగల్ సెంటిమెంట్ కలిసొస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రంతో మరోసారి మహేష్ బాబు.. సంక్రాంతి హీరో అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.