యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు రాజమౌళి సినీ జీవితంలో ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘ఛత్రపతి’ తర్వాత ‘బాహుబలి’ సినిమా తెరకెక్కింది. బాహుబలి సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక సంచలనం. మామలు తెలుగు సినిమాగా ప్రారంభమైన ‘బాహుబలి’ఈ సినిమా ఆ తర్వాత దేశీయ సినిమాగా.. ఆపై ఇంటర్నేషనల్ లెవల్లో ఓ ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు ఒక కథతో తెరకెక్కిన ఈ సినిమా రెండు పార్టులగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు కనీవినీ ఎరగని రీతిలో వసూళ్ల ప్రభంజాన్ని కురిపించింది.అయితే ఈ సినిమానైనా ఏదో ఒకరోజు మొదలుపెట్టాల్సిందే. అలా 2013 జూలై 6న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీలో కాకుండా.. కర్నూలులోని రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభమైంది.
July 6, 2013. The moment when it all began!
We started the shoot of #Baahubali on this day 7 years ago... ✊🏻 pic.twitter.com/JQmbRuplki
— Baahubali (@BaahubaliMovie) July 6, 2020
సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున వేలాది మంది అభిమానుల సమక్షంలో షూటింగ్ ప్రారంభించిన క్షణాలను బాహుబలి చిత్ర యూనిట్ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఫస్ట్ డే షూటింగ్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.ఈ సినిమాను కే.రాఘవేంద్రరావు సమర్ఫణలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. ఈ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో ప్రభాస్.. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఇక రానా.. భళ్లాలదేవుడిగా నటించాడు. రమ్యకృష్ణ రాజమాత శివగామి పాత్రలో నటిస్తే.. అనుష్క.. దేవసేనగా మెప్పిస్తే.. తమన్నా.. అవంతికి పాత్రలో ఇమిడిపోయింది. ఇక కట్టప్పగా సత్యరాజ్, బిజ్జాలదేవగా నాజర్ తమ నటనతో ఈ సినిమాకు ప్రాణం పోసారు.
మొత్తంగా రెండు పార్టులు కలిపి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2400 కోట్ల వరకు వసూలు చేసి ఔరా అనిపించింది. మొత్తంగా బాహుబలి తెలుగు చిత్ర సీమలో తన కంటూ కొన్ని పేజీలు కాదు.. ఒక పుస్తకమే రాసుకుందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty, Bahubali, Bollywood, Prabhas, Tamannah, Tollywood