Aadvik: ఈ ఫోటోలో క్యూట్ లుక్స్‌తో అదరగొడుతున్న ఈ అబ్బాయి ఫోటో.. ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరు ఈ అబ్బాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఇంతకీ ముద్దు లొలికిస్తోన్న ఆ బుడతడు ఎవరి అబ్బాయి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమారుడు. తాజాగా అజిత్ వాళ్ల ఇంట్లో జరిగిన ఓ పెళ్లిలో అజిత్ కుమారుడు ఆద్విక్ అజిత్ సందడి చేసాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో అజిత్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. అజిత్.. ప్రస్తుతం తమిళనాట అగ్ర హీరోగా సత్తా చూపెడుతున్నాడు. ఈయన హీరోగానే కాకుండా.. బైక్ రేసర్‌గా అందరికీ సుపరిచితం. ముఖ్యంగా దక్షిణాది ఇండస్ట్రీలో బైక్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ తల అజిత్. ఈయనకు బైక్‌లంటే విపరీతమైన ఇష్టం... కాదు కాదు ప్రాణం.
ప్రొఫెషనల్ రేసింగ్‌లో కూడా పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ప్రతీ సినిమాలో కూడా కచ్చితంగా ఒక్కటైనా ఛేజ్ సీన్ కూడా ప్లాన్ చేస్తుంటాడు ఈయన. అజిత్ బైక్ రైడింగ్ కెపాసిటీ తెలిసి దర్శకులు కూడా అలాంటి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈయన వాలిమై సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన తెలుగులో ‘ప్రేమ పుస్తకం’ అనే సినిమాలో నటించాడు. ఆ తరవాత తమిళంలో నెంబర్ హీరోగా సత్తా చూపెడుతున్నాడు.
ఈయన బాలు కుమారుడు.. చరణ్‌కు మంచి స్నేహితుడు అన్న సంగతి తెలిసిందే కదా. ఇక అజిత్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్లిన అబ్బాయిని వెంట తీసుకెళ్లి అభిమానులకు తెలిసేలా చేస్తున్నాడు. ఇప్పటి నుంచే ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్ అయ్యేలా చేస్తున్నాడు. ఫ్యూచర్లో అజిత్ కుమారుడు ఆద్విక్‌ను హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులు.. ఇప్పటి నుంచే అతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేస్తున్నారు. అంతేకాదు ఈ బుడతడిని అజిత్ అభిమానులు.. కుట్టీ తల అని పిలుస్తుంటారు. అజిత్, శాలిని దంపతులకు కూతురు అనౌష్క, కుమారుడు ఆద్విక్ ఉన్నారు. 2015లో అజిత్, షాలినీ దంపతులుకు ఆద్విక్ జన్మించాడు. 2008లో కూతురు అనౌష్క పుట్టింది. ఇక అజిత్.. కోలీవుడ్‌లో విశ్వాసం, నెర్కొండ పార్వై వంటి బ్యాక్ బ్యాక్ టూ హిట్స్‌తో మంచి ఊపులో ఉన్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 28, 2021, 07:41 IST