Thimmarusu 1st Week Collections: పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత కరోరా సెకండ్ వేవ్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూత పడ్డాయి. దాదాపు 4 నెలల తర్వాత పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. గత వారమే కొత్త సినిమాలు థియేటర్స్‌లో విడుదలయ్యాయి. గత వారం సత్యదేవ్ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’ తో పాటు తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ సినిమాలు విడుదలయ్యాయి. వీటితో పాటు రెండు మూడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ రెండింటిలో సత్యదేవ్ ‘తిమ్మరుసు’ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తర్వాత మరోసారి కోర్టు డ్రామా నేపథ్యంలో సత్యదేవ్ ‘తిమ్మరుసు’ సినిమా వచ్చింది. రొటీన్ కథ అయినా.. పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను మెప్పించారు డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి. అంతేకాదు ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. భారీ గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘తిమ్మరుసు’ సినిమాకు మొదటి రోజు రూ. 54 లక్షల వరకు షేర్ సాధించింది.
ఈ శుక్రవారంతో మొదటి వారం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయానికొస్తే..దాదాపు రూ. 3 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఒక వారం తర్వాత రూ. 2 కోట్లకు అటు ఇటు కలెక్షన్స్ రాబట్టినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో రూ. కోటి రూపాయల లక్ష్యాన్ని ఈ సినిమా ఏ మేరకు రాబడుతుందో చూడాలి. ఈ రోజు ’ఎస్ఆర్ కళ్యాణమండపం’, తో పాటు మరికొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో తిమ్మరుసు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
SP Balasubrahmanyam : అమ్మకానికి దివంగత ఎస్పీ బాలు ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్..
అల్లు అర్జున్ కూతురు నుంచి ఎన్టీఆర్ కుమారుడు వరకు వెండితెరపై స్టార్ కిడ్స్ సందడి..
Suma Kanakala - Rajeev : వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు..
నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన ఎన్టీఆర్ .. మరోసారి అక్కినేని Vs నందమూరి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office, Satyadev, Tollywood