హోమ్ /వార్తలు /సినిమా /

ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే

ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల అవుతుంటే.. 14వ తేదీని కేజీఎఫ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది, దీంతో ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు మూవీలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు,

కరోనా దెబ్బతో గత రెండేళ్లుగా సినిమా హాళ్లు.. థియేటర్లు పూర్తిగా కళ తప్పాయి. ఇప్పటికే చాలామంది సినిమా హల్ ముఖం చూసి దాదాపు మూడేళ్లు కావస్తుందేమో. కరోనా భయంతో జనం ఎవరూ ఇళ్ల నుంచి కదల్లేని పరిస్థితి. అను సినిమా పరిస్థితి కూడా అలాగే మారింది. పెద్ద పెద్ద సినిమాలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. కరోనా(Covid) దెబ్బకు షూటింగ్‌లన్నీ బంద్ అయ్యాయి. అయితే అదే సమయంలో ఓటీటీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. జనం ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు చూడటం ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా మారడంతో సినీ అభిమానులు ఇప్పుడు మళ్లీ థియేటర్(Theatre) వైపు వెళ్తున్నారు. దీంతో వరుసగా స్టార్ హీరోల నుంచి మామూలు సినిమాలు సైతం విడులకు సిద్ధహవుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'( Bheemla Nayak) తో జనాలకు సినిమా పండగ మొదలయ్యింది. ఇక అక్కడి నుండీ రెండు వారాలకు ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. మార్చి 11న 'రాధే శ్యామ్'(Raadhe Shyam) రిలీజ్ అయ్యింది. మార్చి 25న 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR)వచ్చింది. దాని హవా ఇంకా తగ్గకుండానే 'గని'(Ghani) కూడా వచ్చింది. ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. థియేటర్లో మాత్రమే కాదు ఓటిటి(OTT)ల్లో కూడా ప్రేక్షకులకి ఈ వారం కొత్త సినిమాలు అలరించనున్నాయి. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాలు :

బీస్ట్ : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay), అందాల భామ పూజ హెగ్డే(Pooja Hegde) కలిసి నటించిన సినిమా బీస్ట్. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'డాక్టర్' (Doctor) ఫేమ్ నెల్సన్ బీస్ట్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, పాటలు మంచి హిట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు మూవీ టీం కూడా ప్రెస్ మీట్లు పెట్టి సినిమా ప్రమోషన్లలో బిజీగా మారింది.

కె.జి.ఎఫ్ చాప్టర్ 2 : ఈ వారం వస్తున్న మరో పెద్ద మూవీ కేజీఎఫ్ చాఫ్టర్ 2(KGF Chapter2). కన్నడ హీరో యష్(Yash) నటించిన ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. తెలుగులో ఈ మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రోమోలు, ట్రైలర్లు కూడా సూపర్ హిట్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగే అవకాశం ఉంది. కేజీఎఫ్‌తో యష్ పాన్ ఇండియా హీరోగా మారాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా యష్‌కు అభిమానులు ఉన్నారు.

ఇక ఓటీటీ(OTT) విషయానికి వస్తే.. ఈ వారం ఓటీటీలో కూడా మూడు మంచి సినిమాలు విడుదల కానున్నాయి. శర్వానంద్(Sharwanand) హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు( Aadavallu Meeku Johaarlu) సినిమా ఈ వారమే ఓటీటీలో రానుంది. ఓటీటీ వేదికగా ఆహా(Aha)లో ఏప్రిల్‌ 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కానుంది. సోని లివ్‌లో శర్వానంద్ ఈ కొత్త మూవీ ప్రేక్షకులను అలరించనుంది.

'కార్తికేయ' చిత్రాన్ని తెరకెక్కించిన చందు నుంచి రాబోతున్న సినిమా బ్లడీ మేరి(Bloody Mary). నివేదా పేతురాజ్‌(Nivetha Pethuraj) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బ్లడీ మేరీ' చిత్రం కూడా ఈ వారం ఓటీటీలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని మరో మనిషి ఉంటాడు. అవసరం, అవకాశాన్ని బట్టి ఆ మనిషి బయటకు వస్తాడు. విషయమేమంటే ఆ బయటకొచ్చిన మనిషే ఒరిజినల్‌' అంటూ అజరు చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

గాలివాన : ఈ వెబ్ సిరీస్‌ ఏప్రిల్‌ 14 నుండీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 31న కింగ్‌ అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni) ఈ వెబ్ సిరీస్(Gaalivaana webseries) ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ వీక్షకులను నరాలు తెగే సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా సాగే ఈ ట్రైలర్‏లో రాధిక సెంటిమెంట్‌ డెలాగ్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. డైలాగ్ కిండ్ సాయి కుమార్(Sai Kumar), రాధిక(Radhika Sarathkumar) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్‌, అశ్రిత, అర్మాన్‌, నందిని రాయ్‌, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First published:

Tags: Aadavallu meeku johaarlu, Actress Radhika, Beast Movie, KGF Chapter 2, Sai Kumar

ఉత్తమ కథలు