నేను ఫిదా అవ్వడానికి.. ఆ రెండు చాలు : పూజా హెగ్డే

పూజా హెగ్డే..  'ఒక లైలా కోసం' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఆ సినమా తర్వాత వరుసగా సనిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో త‌న స‌త్తా చాటుతుంది.

news18-telugu
Updated: September 21, 2019, 10:58 AM IST
నేను ఫిదా అవ్వడానికి.. ఆ రెండు చాలు : పూజా హెగ్డే
పూజా హెగ్డే..  'ఒక లైలా కోసం' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఆ సినమా తర్వాత వరుసగా సనిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో త‌న స‌త్తా చాటుతుంది.
  • Share this:
పూజా హెగ్డే..  'ఒక లైలా కోసం' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. ఆ సినమా తర్వాత వరుసగా సనిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో త‌న స‌త్తా చాటుతుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ స్టార్ ఇమేజ్ అందుకుంది. పూజా హెగ్డే ఇటీవల 'మ‌హ‌ర్షి' చిత్రంతో అభిమానుల‌ని అల‌రించ‌గా, ఆమె తాజా సినిమా 'గద్దలకొండ గణేష్' చిత్రం ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం పూజా.. 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో', 'హౌజ్‌ఫుల్ 4', ప్ర‌భాస్‌ రాధాకృష్ణ చిత్రాల‌తో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డిని మ‌రో ఆఫ‌ర్ ప‌ల‌క‌రించింది. అఖిల్ నాల్గొవ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు సమాచారం. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌ త‌న నాలుగో చిత్రాన్ని చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు .
 View this post on Instagram
 

🍫 anyone? ☺️


A post shared by Pooja Hegde (@hegdepooja) on

అది అలా ఉంటే పూజాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విషయం ఏమిటంటే .. చాలామంది అమ్మాయిలను ఇంప్రెస్స్ చెయ్యటానికి నానా కష్టాలు పడుతుంటారు కానీ పూజని ఇంప్రెస్స్ చెయ్యాలంటే మంచి ఫుడ్ లేదా కాండిల్ లైట్ డిన్నర్‌కి తీసుకువెళ్తే చాలంట. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో పూజా మాట్లాడుతూ.. తాను మంచి ఫుడ్ లవర్‌ అని..తనను పడెయ్యాలంటే మంచి రుచికరమైన ఫుడ్ ఆఫర్ చేస్తే చాలని... వీటికి తోడు వినయం, ఇంటెలిజెంట్ ఈ రెండు లక్షణాల కలిగిన అబ్బాయి అయితే తను చాలా ఈజీగా అట్ట్రాక్ట్ అవుతానని చెప్పింది. ఇక పూజా హీరోయిన్ కాకపోతే.. ఫ్యాషన్‌ స్టైలింగ్‌, ఫొటోగ్రఫీ వైపు వెళ్లెదట. బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఒక జత బట్టలు, కళ్ళజోడు మాత్రం తన వెంట ఉండాల్సిందేనట. తనలో తనకి నచ్చేది తన హైట్ ఇంకా రెండో విషయం తన నవ్వుని చెబుతోంది. ఏదేమైనా తనకు కాబోయే సోల్ మెట్ ఎలావుండాలో పూజా ఇండైరెక్ట్‌గా క్లూ ఇచ్చేసింది. 
View this post on Instagram
 

🎻


A post shared by Pooja Hegde (@hegdepooja) on
First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading