తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ షో అనేది ఎవర్ గ్రీన్. తెలుగులో ఓ రియాలిటీ కామెడీ షో ఇంతగా సక్సెస్ అవుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఈ ఒక్క షోతోనే చాలా మంది జీవితాలు బాగుపడ్డాయి. ముఖ్యంగా జీరో నుంచి హీరో అయ్యారు చాలా మంది. అందులో చాలా మంది నటులు జబర్దస్త్ షోకు రాకముందు మంచి క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ గా పరిచయం అయ్యారు. బాగా డబ్బులు సంపాధించుకుని సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ ఒక్క షో వల్ల ఎంతో మంది జీవితాలు ఒక్కసారిగా తిరిగాయి.
ముఖ్యంగా కూలీ స్థాయి నుంచి ఈ రోజు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగారు కూడా. హోటల్లో కప్పలు కడుక్కునే స్థాయి నుంచి అదే హోటల్‌కు చీఫ్ గెస్టులుగా వెళ్లే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా చంద్ర, రాఘవ, సుధీర్, రాంప్రసాద్ లాంటి వాళ్లు జబర్దస్త్ కామెడీ షోకు రాకముందు చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు. అలాంటి వాళ్లంతా జబర్దస్త్ వచ్చిన తర్వాత లక్షల్లో సంపాదించారు. ముఖ్యంగా ఫ్యామిలీ స్కిట్స్‌తో నవ్వించే చమ్మక్ చంద్ర జబర్దస్త్‌కు రాకముందు కూలీ పని చేసేవాడని తెలుస్తుంది. సాధారణంగానే నిరుపేద అయిన చంద్ర.. కామెడీ షోకు ముందు చాలా వరకు ఇబ్బంది పడ్డాడు. షోకు వచ్చిన తర్వాత ఒక్కో ఎపిసోడ్‌కు మూడున్నర లక్షలు తీసుకుంటున్నాడు. జీ తెలుగుకు వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా పారితోషికం అందుకుంటున్నాడు చంద్ర.
ఇక సుడిగాలి సుధీర్ కూడా జబర్దస్త్‌కు రాకముందు మెజీషియన్‌గా ఉంటూ నెలకు కేవలం పదివేలు మాత్రమే సంపాదించేవాడు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాడు. అదిరే అభి గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. ఇక హైపర్ ఆది బి టెక్ తర్వాత కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఆ తర్వాత యూ ట్యూబ్ వీడియోలు చేసాడు. అక్కడ్నుంచి అభి స్కిట్స్ నుంచి ఫేమ్ తెచ్చుకుని ఇప్పుడు హైపర్ ఆది అయ్యాడు. ఒక్కో ఎపిసోడ్‌కి మూడు నుంచి 5 లక్షలు అందుకుంటున్నాడు.
ఇక జబర్దస్త్ కట్టప్ప రాకెట్ రాఘవ దూరదర్శన్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసాడు. ఇప్పుడు ఈయన జబర్దస్త్ కామెడీ షోలో ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 3 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఎఫ్ఎం రేడియోలో పనిచేసే చలాకీ చంటి సినిమాల్లోకి వచ్చి తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యాడు. ఇక హోటల్లో టీ బాయ్‌గా పని చేసిన ముక్కు అవినాష్ ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు లక్షకు పైగా ఆదాయం సంపాదించుకుంటున్నాడు.
మరో కమెడియన్ కిరాక్ ఆర్పీ కూడా వెయిటర్‌గా పని చేసాడు. స్వతహాగానే రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్ గతంలో హోల్ సేల్ మెడికల్ రంగంలో పని చేశాడు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ టీంలో కీ మెంబర్ ఈయన. మొత్తానికి ఒకప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందర్నీ ఒకేచోటికి చేర్చింది జబర్దస్త్ కామెడీ షో. వాళ్లందరి జాతకాలను మార్చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.